Sugar Cane Juice: వేసవిలో చెరుకు రసం తాగుతున్నారా..అయితే ఇవి తెలుకోండి ?
Sugar Cane Juice: వేసవిలో ఓ గ్లాసు చల్లని చెరుకు రసం తాగినట్లయితే ఎంతో హాయిగా ఉంటుంది. చెరుకు రసం తాగినట్లయితే క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. ఇందులో చక్కెరలు, పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. దీని తీయని రుచి నాలుక నుంచి పేగుల ద్వారా కడుపులోకి జారుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. చెరకులో పిండి పదార్థాలు మాంస కృత్తులు అధికంగా ఉంటాయి.

Sugar Cane Juice Side Effects,sugar cane juice
అంతేకాకుండా జింక్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లతో పాటు ఖనిజాలు, సహజ చక్కెర, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చెరుకు రసంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వేసవిలో వేడి దెబ్బ నివారించడానికి, బలహీనతను తొలగించడానికి చెరకు రసం ఎంతగానో సహాయం చేస్తుంది. వేసవిలో శరీరం నుంచి అధిక చెమట వెలువడటం కారణంగా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పెంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. చరకు రసం కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలో వేడిని బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా కామెర్ల వ్యాధి నివారణకు కూడా చెరకు రసం ప్రయోజనకరంగా ఉంటుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
MS Dhoni: ధోని రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే.. చెన్నై ఫ్యాన్స్ డిమాండ్ ?
చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు శరీర వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెరుకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు కూడా చెరకు రసం తాగినట్లయితే సులవుగా తొలగిపోతాయి. చర్మం మెరుస్తుంది. చెరకు రసం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం, గుండెలో మంటను తగ్గిస్తుంది. ఇది మంచి పోషకాలతో నిండిన రసమని చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు. కడుపునిండుగా ఉంటుంది.