Sumanth: అక్కినేని హీరోల పరువు తీసిన సుమంత్.. నాగార్జునతో గొడవలే కారణమా.?
Sumanth: ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ప్రధాన కారకుడు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు.. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టే ఆయన కొడుకులు, బిడ్డలు, మనవాళ్ళు అంతా హ్యాపీగా జీవించగలుగుతున్నారు.. అంతటి ఘనత సాధించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఆ ఫ్యామిలీ ఎంతో ఆరాధిస్తుంది..

Sumanth who defamed Akkineni heroes
అలాంటిది అక్కినేని కుటుంబంలో పుట్టి తన తాతగారైనటువంటి అక్కినేని నాగేశ్వరావు అంటే ఇష్టం లేదని చెప్పాడు హీరో సుమంత్.. దీనికి కారణం ఏంటి, వివరాలు చూద్దాం.. సుమంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమై పలు చిత్రాలు తీశారు.. కానీ ఆయన చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో పలు చిత్రాల్లో కీలకమైనటువంటి పాత్రలో నటిస్తూ దూసుకుపోతున్నారు. (Sumanth)
Also Read: Nalini: యాక్షన్ కింగ్ అర్జున్ ప్రియురాలి కన్నీటి కష్టాలు..?
అలాంటి సుమంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నాకు అక్కినేని హీరోలు అంటే అస్సలు నచ్చదు.. నాకు మొదటి నుంచి నా ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పుకొచ్చారు.నేను చాలా వరకు ఆయన సినిమాలే చూస్తూ పెరిగాను.. ప్రస్తుతం ఈ అభిమానం కాస్త మహేష్ బాబుపై కలిగింది.. నేను మహేష్ బాబుకు వీరాభిమానిగా మారానని చెప్పుకొచ్చారు..

ఈ విధంగా సుమంత్ మాట్లాడడంతో అక్కినేని అభిమానులు అంతా షాక్ అయిపోతున్నారు.తాత నటవారసత్వాన్ని పట్టుకొని ఇండస్ట్రీలో ఎదిగి ఆ ఫ్యామిలీని కించపరుస్తావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ వీడియోకు సంబంధించినటువంటి క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.. దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి.(Sumanth)