Summer Fruits: ఎండాకాలంలో కచ్చితంగా పండ్లు ఇవే.. !


Summer Fruits: వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. ఎండ తీవ్రత రోజురోజుకు విపరీతంగా పెరిగివుతుంది. ప్రకృతి అందించిన కొన్ని రకాల పండ్లు ఈ వేసవి కాలంలో తిన్నట్లయితే శరీరానికి తేమ అంది చల్లదనాన్ని కలిగిస్తాయి. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల వేసవికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. వేసవికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరాన్ని ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. ఎలాంటి పండ్లు తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు చూద్దాం…. వేసవికాలంలో పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో 96% నీరు, ఐదు శాతం ఫైబర్ ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు.

Summer Fruits est Fruits for Summer Season

ఇందులో తక్కువ కేలరీలో ఉండడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా మంచిది. పుచ్చకాయ శరీరానికి శక్తిని అందిస్తుంది. కర్బూజ పండు కూడా చాలా మంచిది. ఇందులో 92% నీరు ఉంటుంది. ఇది ఫైబర్ తో నిండిన పండు అందువల్ల ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పైనాపిల్ చాలామందికి ఇష్టమైన పండు. ఇందులో 80% నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవికాలంలో దీనిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పనసపండు ఇందులో 76% నీరు ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, విటమిన్ అధికంగా ఉంటాయి. ఇది తిన్న వెంటనే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ద్రాక్ష ఇందులో 90% వరకు నీరు ఉంటుంది.

అంతే కాకుండా ఇలాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వేసవికాలంలో దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. జామకాయ ఇది చాలామందికి ఇష్టమైన పండ్లలో ఒకటి. ఇందులో 85% నీరు ఉంటుంది. జామకాయలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. జామకాయ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది. వేసవికాలంలో కీరదోస కూడా తినడం చాలా మంచిది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో తేమ పెరుగుతుంది. దాహం వెయ్యరు. ఎండ సమయంలో కీరదోస తినడం చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *