K.P. Chowdary: ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ నిర్మాత కి సురేఖ వాణి కూతురికి మధ్య సంబంధం.?
K.P.Chowdhary: సినిమా ఇండస్ట్రీలో బ్రతకడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం చాలా కష్టం.. కొన్ని అనుకోకుండా సినిమాలు వచ్చి భారీ హీట్ అవుతాయి మరికొన్ని ఎంత బడ్జెట్ పెట్టినా ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. ఇలా సినిమాలను నమ్ముకొని డెవలప్ అయిన వారున్నారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన వారు ఉన్నారు..
Surekha Vani daughter The relationship between K.P.Chowdhary
అలా సినిమాల వల్ల ఇబ్బందులు పడి నష్టాల పాలు అయినటువంటి నిర్మాతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెపి చౌదరి.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేపీ చౌదరికి 44 సంవత్సరాలు.. అయితే తాజాగా ఈయన గోవాలోని ఒక అద్దె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.. అయితే కేపీ చౌదరి గత ఆరు నెలలుగా ఆ ఫ్లాట్లోనే ఒంటరిగా నివసిస్తున్నట్టు సమాచారం.. (K.P.Chowdhary)
Also Read: Tamannaah: తమన్నా సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా?
ఆ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేపీ చౌదరి ఆర్థిక సమస్యలన్నీ తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నివేదించారు.. ఆయన మరణంపై తాజాగా నటి సురేఖ కూతురు సుప్రీత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. తనతో దిగినటువంటి ఒక ఫోటోను పోస్ట్ చేసింది.. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అవుతూ ఇలా రాసుకొచ్చింది..
ఈ సొసైటీ ఇక్కడ ఫెయిల్ అయింది ఎప్పటికీ మిస్ అవుతున్నాను అన్న నా బాధలు నేను ఎవరికీ చెప్పుకోవాలి.. నీ బాధలు కూడా మమ్మల్ని వినకుండా చేశావు కదా అన్నా, దయచేసి వెనక్కు వచ్చేయి మిస్ యు కేపీ అన్న.. నువ్వెక్కడున్నా టైగర్ ఏ అంటావుగా ఐ లవ్ యు సో మచ్ అన్నా.. రెస్ట్ ఇన్ ఫీస్ అంటూ రాస్కొచ్చింది.. అయితే అప్పట్లో చౌదరి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సందర్భంగా ఆయనతో పాటు సురేఖ వాణి కుమార్తె సుప్రీత పేర్లు కూడా తెరపైకి వచ్చిన విషయం అందరికీ తెలిసింది..(K.P.Chowdhary)
https://www.instagram.com/p/DFmkJLKpZ5b/?utm_source=ig_web_copy_link