Suriya Kanguva Movie Struggle for Screens

Suriya Kanguva: సినిమా పరిశ్రమలో వెయ్యి కోట్ల క్లబ్ అనేది ప్రెస్టీజియస్ విషయం. గతంలో 500 కోట్ల వసూళ్లు సాధించడమంటే పెద్ద అఛీవ్మెంట్. కానీ, ఇప్పుడు ఆ స్థాయిని దాటేసి వెయ్యి కోట్ల మార్కు వైపు సినీ నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలు ఈ మైలురాయిని చేరుకున్నాయి. అయితే, తమిళ చిత్ర పరిశ్రమ ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరడానికి కృషి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న ‘కంగువ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Suriya Kanguva Movie Struggle for Screens

‘కంగువ’ సినిమాకు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, దీపావళి సందర్భంగా విడుదలైన ‘అమరన్’ సినిమాకు ఇంకా థియేటర్లలో మంచి ఆదరణ ఉంది. దీంతో, తమిళనాడులో ‘కంగువ’కు ఎక్కువ స్క్రీన్‌లను పొందడం కష్టంగా మారింది. దాదాపు 2000 కోట్ల భారీ కలెక్షన్లను సాధించగలదు అనే ఆశతో రూపొందించిన ఈ సినిమాకు అవసరమైన స్థాయి థియేటర్ల లేకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. ‘అమరన్’ సినిమా ఇప్పటికీ రన్ అవుతుండడం ‘కంగువ’కి ఎక్కువ ధియేటర్ లు దొరకడం మరింత కష్టతరం అవుతోంది.

Also Read: Amaran: శివ కార్తికేయన్, సాయి పల్లవి ‘అమరన్’..ఓటీటీలో ఎప్పుడు విడుదల అంటే?

సూర్య అభిమానులు మరియు తమిళ సినీ ప్రేక్షకులు ‘కంగువ’ సినిమాపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా వసూళ్లలో విజయం సాధించాలంటే తమిళనాడులో మరిన్ని స్క్రీన్‌లు అవసరం. కానీ ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్న విధంగా తమిళ పరిశ్రమలో పరస్పర సహకారం అందుబాటులో లేకపోవడం కొంత విచారకరంగా ఉంది. ఉదాహరణకు, ‘బాహుబలి’ కోసం మహేష్ బాబు తన సినిమా విడుదలను వాయిదా వేసి సహకరించిన సంగతి మనకు తెలిసిందే. కానీ, ‘కంగువ’ విషయంలో ఇలాంటి మద్దతు వస్తుందో లేదో చూడాలి.

‘కంగువ’ చిత్రానికి నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ నటీనటులు దిశా పటానీ, బాబీ డియోల్ నటించడం ఈ సినిమాకు మరిం బలం చేకూరుస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. కానీ తమిళనాడులో స్క్రీన్‌ల కొరత ఈ సినిమా విజయానికి ప్రధాన అడ్డంకిగా మారుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, సూర్య అభిమానులు తమ హీరో సినిమాపై విశ్వాసం ఉంచుతూ, ‘కంగువ’ సినిమా తమిళ పరిశ్రమకి భారీ విజయాన్ని తెస్తుందని ఆశిస్తున్నారు.