Sweet Potato: చిలగడ దుంప తింటున్నారా.. అయితే కాస్త జాగ్రత్త


Sweet Potato: చిలగడ దుంప ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఈ చిలగడ దుంపల్లో విటమిన్ b6, విటమిన్ సి, మెగ్నీషియంతో పాటు ఫైబర్, కొవ్వు పదార్థాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. చిలకడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులోని పీచు పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. చిలకడ దుంపలు మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంటాయి. చిలగడ దుంపలలో ఫైబర్ అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేగు కదలికలను మృదువుగా చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడానికి చిలగడ దుంప కీలక పాత్ర పోషిస్తుంది.

Sweet Potato Health Benefits

రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చిలగడ దుంప తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ పేషంట్లకు చిలకడదుంప మంచి ఆహారం. ఇందులో ఉండే విటమిన్ల కారణంగా శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఎంతగానో సహాయం చేస్తుంది. అలాగే ఈ దుంపలలో అధిక స్థాయి పొటాషియం ఉండడం వల్ల హార్ట్ బీట్ ను మెరుగు పరుస్తాయి. తక్కువ మోతాదులో షుగర్ ఉన్నవారికి ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యానికి మేలును చేస్తుంది. గుండె, కండరాలకు చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ల కారణంగా శరీరంలో మంటను తగ్గించి ఫ్రీ రాడికల్స్ ను కాపాడతాయి.

Indra Movie: ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా.?

చిలకడదుంపలతో చిప్స్ కూడా తయారు చేసుకుని తింటారు. వీటిని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా చిలగడ దుంపల తో తయారు చేసిన చిప్స్ తినిపించినట్లైతే వారికి ఎంతగానో నచ్చుతాయి. స్నాక్స్ రూపంలో వీటిని పెట్టినట్లయితే ఇందులో ఉండే పోషకాల కారణంగా వారు బలంగా, ఆరోగ్యంగా తయారవుతారు. చినగడ దుంపలతో కూర కూడా వండుకొని తినవచ్చు. అలా నచ్చని వారు ఉడకపెట్టుకొని కూడా తిన్నట్లయితే చాలా మేలు కలుగుతుంది. వారంలో కనీసం ఒక్కసారి అయినా చిలగడ దుంపలను తిన్నట్లయితే చాలా మంచిది.

Esha Gupta: నటిగా ఎదగాలంటే ఇండస్ట్రీ లో అది చేయడం అవసరం.. ఓపెన్‌గా చెప్పేసిన ఈషా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *