Tabu: బాలీవుడ్ నిర్మాతతో టబు ఎంగేజ్మెంట్..?

Tabu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లిళ్ల విషయంలో కాస్త విముఖత చూపిస్తూనే ఉంటారు. అయితే హీరోయిన్లు స్టార్డం వచ్చాక పెళ్లిళ్లు చేసుకుంటారు కానీ హీరోలు మాత్రం ఐదు పదుల వయసు దగ్గరికి వచ్చినా, పెళ్లిళ్ల విషయంలో కాస్త దూరంగానే ఉంటారు. కానీ ఆ సీనియర్ హీరోయిన్ మాత్రం ఐదు పదుల వయస్సులో కూడా ఇంకా పెళ్లిపై ఊసేత్తడం లేదు. దీనికి నిజమైన కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియలేదు.
Tabu engagement with a Bollywood producer
కానీ సోషల్ మీడియాలో అనేక కారణాలు సృష్టిస్తూ కొంతమంది వార్తలు రాశారు. తాజాగా టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటనేది నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వివరాలు చూద్దాం.. ఒకప్పుడు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది టబు.. ప్రేమదేశం అనే సినిమా ద్వారా అప్పట్లో కుర్రకారు గుండెల్లో ఆరాధ్య దైవం అయింది. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లోకి వెళ్లిన టబూ 50 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు..(Tabu)
Also Read: Genelia: జెనీలియాకి భర్త టార్చర్.. సినిమాలు చేస్తానంటే అలా అన్నారా.?
అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయంలో చాలా హర్ట్ అయిందట. అయితే ఆమె బాలీవుడ్ నిర్మాత అయినటువంటి సాజిద్ నదియావాలతో పీకల్లోతు ప్రేమలో పడిందట. అంతే కాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. అయితే ఎంగేజ్మెంట్ కూడా అన్ని అరేంజ్మెంట్ చేసి ఇంకో ఐదు నిమిషాల్లో ఎంగేజ్మెంట్ అవుతుంది అనగా బ్రేక్ అయిందట. ఈ సంఘటనతో ఎంతో బాధపడిపోయిన టబు ఇక పెళ్లి అనే విషయాన్ని తన జీవితంలో నుంచి తీసేసిందని తెలుస్తోంది.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిలేషన్షిప్ అనేది ఒకటే మార్గం కాదు ఒంటరితనాన్ని కొనసాగించడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. మన జీవితంలోకి వచ్చే భాగస్వామి పేరుతో తప్పుడు వ్యక్తిని ఆహ్వానం ఇచ్చే కంటే ఒంటరితనంగా ఉండడమే బెటర్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. ఇక వీళ్లే కాకుండా అప్పట్లో నాగార్జునతో కూడా ఈమె ప్రేమలో పడిందని ఆయనను కూడా పెళ్లి చేసుకోబోతుందని చాలా సందర్భాల్లో వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన వీరు మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని క్లారిటీ ఇచ్చారు.(Tabu)