
Jagan: ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
Jagan: డీలిమిటేషన్ పై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధాని మోదీని కోరిన వైఎస్ జగన్… ఈ మేరకు లేఖ రాశారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉందని ఈ లేఖలో తెలిపారు. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిందన్నారు. YS Jagan writes…