Tamannaah: ప్రియుడికి బ్రేకప్.. ఆ హీరోతో తమన్నా ఎఫైర్.?
Tamannaah: ఇండియన్ హిస్టరీలో హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం అంటే చాలా కష్టమైన పని. ఎంతోమంది అభిమానుల మనసులను కొల్లగొడితేనే ఇండియన్ సినీ హిస్టరీలో హీరోయిన్ గా ఒక పేరు గుర్తింపు వస్తుంది. అలా కొంతమంది హీరోయిన్లు సౌత్ కే పరిమితమవుతారు. ఇంకొంతమంది హీరోయిన్లు నార్త్ కే పరిమిత అవుతారు. కానీ అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సౌత్ నార్త్ రెండు ఇండస్ట్రీలను కవర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో తమన్నా ఒకరు.

Tamannaah affair with that hero
అయితే అలాంటి తమన్నా తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంది.దానికి కారణం బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. గత రెండు సంవత్సరాలుగా తమన్నా భాటియా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూన్నారు.అలా ముంబైలో ఒకే రూమ్ లో ఉంటూ సహజీవనం చేస్తున్న ఈ జంట సడన్గా విడిపోయారంటూ కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా తమన్నా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేయడంతో తమన్నా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిందనే వార్తలు వినిపించాయి. (Tamannaah)
Also Read: Samantha: డాన్స్ మాస్టర్ తో సమంత ఘాటు రొమాన్స్.. నోట్లో నోరు పెట్టి.?
అయితే ఆ వార్తలు కొంతవరకే వినిపించినప్పటికీ తాజాగా తమన్నా బ్రేకప్ వార్తలు మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అయితే ప్రముఖ వెబ్సైట్ పింక్ విల్లా పేర్కొన్న దాని ప్రకారం..తమన్నా భాటియా విజయ్ వర్మ ఇద్దరూ గత కొద్దిరోజుల ముందే బ్రేకప్ చెప్పుకున్నారని, కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని, ప్రస్తుతం వారిద్దరూ కలిసిలేరని,పెళ్లి చేసుకోవాలననుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పుకొని ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉందామని నిర్ణయం తీసుకున్నారంటూ పింక్ విల్లా రాస్కొచ్చింది.

దాంతో ఈ మ్యాటర్ కాస్త మీడియాలో వైరల్ గా మారింది.అయితే తమన్నా ప్రియుడికి బ్రేకప్ చెప్పడం వెనుక అనేక గాసిప్ లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో తమన్నాకి బాలీవుడ్ నటుడితో ఎఫైర్ ఉందని,ప్రస్తుతం ఆ బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉండడం వల్లే విజయ్ వర్మ ని వదిలేసింది అని రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇంకొక మందేమో విజయవర్మనే తమన్నాని వదిలేసారు అంటూ ఇలా కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి తమన్నా విజయ్ వర్మల బ్రేకప్ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ జంట క్లారిటీ ఇవ్వాల్సిందే.(Tamannaah)