Tamannaah Bhatia: పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి.. అప్పట్లో తెగ వైరల్ అయిన న్యూస్!!
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. శ్రీ అనే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించింది. తమన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 19 సంవత్సరాలు పూర్తయింది. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.
Tamannaah Bhatia Clears Rumors About Dating Pakistani Cricketer Abdul Razzaq
ఇదిలా ఉండగా…. తమన్నాకు సంబంధించిన ఓ వార్త ఆమధ్య సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. గతంలో తమన్నా ఓ పాకిస్తాన్ క్రికెటర్ ను ప్రేమించిందని, అతనితో డేటింగ్ చేసిందని, అనంతరం ఏమైందో తెలియదు వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని జోరుగా ప్రచారాలు జరిగాయి. ఆ క్రికెటర్ మరెవరో కాదు పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తితో తమన్నా డేటింగ్ చేసినట్టు ఎన్నో రకాలుగా రూమర్స్ వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Mohammed Shami: షమీ కి శాపం లా మారిన గాయం.. ఎప్పుడు తిరిగొచ్చెనో?
ఆ ఫోటోలు చూసిన చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే ఈ వార్తలపై తమన్న స్పందించి మేమిద్దరం ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సమయంలో కలిసామని, ఆ వ్యక్తిని కలవడం అదే మొదటిసారని తమన్నా వెల్లడించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి స్నేహం కానీ, ప్రేమ కానీ లేదని చెప్పుకొచ్చింది. ఇక తమన్నా ఈ వార్తలపై స్పందించిన అనంతరం ఆ వార్తలకు చెక్ పడింది.ఇప్పుడు ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందని , త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.