Tamannaah: సల్మాన్ ఖాన్ తో తమన్నా హాట్ రొమాన్స్.. ప్రియుడిని వదిలేసిందా.?


Tamannaah: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు.. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అలాంటి ఈ హీరోపై హీరోయిన్లు కూడా చాలా వరకు మనసు పారేసుకుంటారు.. అలాంటి సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.. ఇదే తరుణంలో సల్మాన్ ఖాన్ తమన్నాతో రొమాన్స్ చేస్తున్నారని వారిద్దరూ బీచ్ కి వెళ్లి చాక్లెట్ పూసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tamannaah hot romance with Salman Khan

Tamannaah hot romance with Salman Khan

ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ తమన్నా నీ లవర్ విజయ్ వర్మను వదిలేసి సల్మాన్ ఖాన్ ను పట్టేశావా అంటూ మాట్లాడుతున్నారు.. మరి ఇది ఎంతవరకు నిజం ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తమన్నా భాటియా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు దగ్గరికి వస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, బాలీవుడ్ లో కూడా ఈమె అరంగేట్రం చేసి మంచి ఫామ్ లో ఉందని చెప్పవచ్చు. (Tamannaah)

Also Read: Chiranjeevi: హీరోయిన్ చీరలోపల చెయ్యి.. అందరి ముందే చిరంజీవి ఫ్రెండ్ ని కొట్టిన హీరోయిన్.?

అలాంటి తమన్నాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కాజల్ లాంటి హీరోయిన్స్ అంతా పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు. కానీ తమన్నా భాటియా మాత్రం ఇప్పటికి పెళ్లి ఊసేత్తడం లేదు. కానీ తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి లవ్ విషయం జోరుగా వినిపిస్తున్న తరుణంలో తమన్నా సల్మాన్ ఖాన్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Tamannaah hot romance with Salman Khan

అయితే నిజానికి ఈ ఫోటోలు వారు బీచ్ లోకి వెళ్లి దిగినవి కాదట.. టెక్నాలజీ ద్వారా వీళ్ళిద్దరూ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలను క్రియేట్ చేసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారట. అంతేకాదు వీరిద్దరూ కలిసి చాక్లెట్ పూసుకొని క్రియేట్ చేసి ఫోటోలను బయటకు వదిలారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఇది ఏఐ ఫోటోలంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.(Tamannaah)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *