Tamannaah item song: ఐటెం పాటలకు తమన్నా స్పెషలైజ్డ్.. కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు!!

Tamannaah item song: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినీ కెరీర్‌ను చక్కగా మెయింటేన్ చేస్తూ, స్పెషల్ సాంగ్స్‌లో తనకే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మంచి డ్యాన్సర్ కావడం వల్ల, ఆమె నటించిన పాటలు ఎక్కువగా ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు తమ సినిమాల్లో ఆమె పాట ఉంటే అది హిట్ అయ్యే గ్యారంటీగా భావిస్తున్నారు.
Tamannaah item song breaks records
తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, వాణి కపూర్ జంటగా నటించిన Ride 2 చిత్రంలో తమన్నా “Nasha” అనే ప్రత్యేక పాటలో నటించింది. ఈ పాటకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లోనే ఈ పాటకు 12 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది ఈ వీడియో.
ఈ ఐటెం సాంగ్ కోసం తమన్నా తీసుకున్న remuneration (పారితోషికం) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఐదు నిమిషాల పాటలో నటించేందుకు ఆమె కోటి రూపాయలు తీసుకుందనే వార్త బీ టౌన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది తమన్నా క్రేజ్‌కి నిదర్శనం.
తమన్నా భాటియా తన అందం, అభినయం, అద్భుతమైన నాట్య నైపుణ్యంతో ప్రత్యేక పాటల్లో shine అవుతూ, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఆమెకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే “Item Song Queen” అనడం అతి శయవాదం కాదు.