Tamannaah: మరొకరితో రొమాన్స్.. అందుకే బ్రేకప్..ఫస్ట్ టైం స్పందించిన తమన్నా..?
Tamannaah: తమన్నా భాటియా విజయ్ వర్మల బ్రేకప్ రూమర్స్ ఇండస్ట్రీని ఎంతలా షేక్ చేస్తున్నాయో చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తమన్నా విజయ్ వర్మల బ్రేకప్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి బ్రేకప్ వార్తలపై అనేక రూమర్లు వెల్లువెత్తున్న వేళ రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న తమన్నా బ్రేకప్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది తమన్నా ఆ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ఓ జంట మధ్య బ్రేకప్ అవ్వడానికి కారణం కండిషన్స్ పెట్టడమే.

Tamannaah reacted to the breakup for the first time
ఒకరికి ఒకరు కండిషన్స్ పెట్టుకోవడంతో వారి మధ్య ఉన్న బంధం బ్రేక్ అవుతుంది. మనం ఒకరిని ప్రేమించామంటే వారి భావాలకు కూడా స్వేచ్ఛనివ్వాలి.కానీ వారికి స్వేచ్ఛ ఇవ్వకుండా మనకు నచ్చినట్టే ఉండాలంటే అది ప్రేమ కాదు. వన్ సైడ్ లవ్వే.. మరియు వ్యాపార లావాదేవీల వంటివి అనుకోవాలి.అందులో ప్రేమ ఎక్కడ ఉంటుంది.షరతులతో కూడిన ప్రేమ బంధాన్ని కంటిన్యూ చేయడం కంటే వదిలేసుకోవడమే మంచిది. (Tamannaah)
Also Read: Sonali Bindre: సోనాలి బింద్రేపై మోజు .. లైవ్ లోనే పక్కకురా అంటూ పొలిటీషియన్ సైగలు.?
నిజానికి ప్రేమికుల మధ్య ఎప్పుడైతే కండిషన్స్ పెట్టుకోవడం మొదలవుతాయో అప్పుడే వారి మధ్య ఉన్న బంధం బ్రేక్ అవుతుందని నేను నమ్ముతాను.ప్రేమ బంధం లో కండిషన్స్ ఉండకూడదు అని నా అభిప్రాయం. నిజానికి చెప్పుకోవాలంటే రిలేషన్ లో ఉన్న దాని కంటే లేకపోయినప్పుడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ తమన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇక తమన్నా మాటలతో బ్రేకప్ కి సంబంధించి ఇలా పరోక్షంగా హింట్ ఇచ్చిందని, ఆమెకి బాయ్ ఫ్రెండ్ కండిషన్లు పెట్టడం కారణంగానే బ్రేకప్ చెప్పిందని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు సినిమాలు వదియాలని,సినిమాల్లో ఇతరులతో రొమాన్స్ చేయడం ఆపేయాలి అని విజయ్ వర్మ కండిషన్స్ పెట్టడం వల్లే తమన్నాకు ఇది నచ్చక వదిలేసుకుంది అంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తమన్నా విజయ్ వర్మల బ్రేకప్ వేళ తమన్నా బ్రేకప్ గురించి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Tamannaah)