Tamannaah: కారవాన్ లో చీకటి బాగోతం.. ఆ పని కోసం తమన్నాని టార్చర్ చేసి.?
Tamannaah: సినిమా ఇండస్ట్రీలో బయటికి తెలియని చీకటి బాగోతాలు ఎన్నో ఉంటాయి.వాటి గురించి చెబితే ఒక రోజు సరిపోదు ఒక వారం సరిపోదు. ఇది చిన్న చిన్న సెలబ్రిటీల మెదలు పెద్ద హీరోయిన్ల వరకు అనుభవించిన పరిస్థితే.కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు సింగర్లు, టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరు అనుభవించిన వారే ఉంటారు. అయితే ఇలాంటి అనుభవం తమన్నాకి కూడా ఎదురైందట.

Tamannaah Shocking Comments On Casting Couch
అంతేకాదు క్యారవ్యాన్లోనే తనపై అసభ్యంగా అలా చేశారు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి నేను ఎన్నో అనుకున్నాను. కానీ నేను ఊహించిందంతా ఇండస్ట్రీ లో లేదు. అయితే అలా అని పూర్తిగా బ్యాడ్ గా ఉంటారని కాదు. కొంతమంది అలా ఉంటారు.ఇండస్ట్రీ అన్నప్పుడు కొంతమంది చీడపురుగులు కూడా ఉంటారు. (Tamannaah)
Also Read: NTR: భార్యని అడ్డుపెట్టుకొని పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్..పెద్ద స్కెచ్చే వేసాడుగా.?
ఆ చీడ పురుగులు నా లైఫ్ లో కూడా ఉన్నారు.నేను ఓ సినిమా షూటింగ్ సమయంలో క్యారవ్యాన్ లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక ఆయన ప్రవర్తించిన నీచమైన ప్రవర్తనకు నాకు ఇప్పటికి కూడా చెప్పడానికి మాటలు రావడం లేదు. ఆ పరిస్థితి జరిగాక కొద్ది రోజుల వరకు డిప్రెషన్ లోకి వెళ్లి ఏడ్చాను. ఇప్పుడు కూడా అది గుర్తుకొస్తే నా కళ్ళలోంచి కన్నీళ్లు వస్తాయి.

అంత టార్చర్ అనుభవించాను అంటూ చెప్పింది. అయితే తమన్నా క్యారవ్యాన్ లో తనకు అసభ్య ప్రవర్తన ఎదురైంది అని చెప్పింది కానీ ఏం జరిగిందో చెప్పలేదు.అలాగే ఎవరు ప్రవర్తించారో కూడా చెప్పలేదు. ఇక తమన్నా మాటలు వింటుంటే నిర్మాతనో లేక హీరోనో లేకపోతే డైరెక్టర్ దగ్గర ఆమెకు ఎదురైంది అని అర్థమవుతుంది.(Tamannaah)