Tamannaah: ఆ నటి తో విజయ్ వర్మ డేటింగ్.. ఆ పని చేస్తుండగా తమన్నా కళ్లారా చూసి..?


Tamannaah Vijay Varma Break up Rumours

Tamannaah: ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏంతో తెలియదు కానీ ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.. అయితే తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాల దగ్గరికి వస్తోంది. ఈమె తోటి హీరోయిన్స్ అంతా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు.

Tamannaah Vijay Varma Break up Rumours

కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంటూ సినిమాల్లో దూసుకుపోతుంది. బాలీవుడ్ నటుడు అయినటువంటి విజయ్ వర్మతో సినిమా షూటింగ్ సమయంలో లవ్ లో పడింది. అలా వీరి మధ్య బంధం కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఈ తరుణంలోనే ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. (Tamannaah)

Also Read: Aamir Khan: ఆరేళ్ల బాబున్న అమ్మాయితో అమీర్ ఖాన్ ఎఫైర్.. మీడియాకు పరిచయం చేస్తూ.?

ఈ కారణం కూడా బాలీవుడ్ లోని ఒక హీరోయిన్ అని సమాచారం.. అయితే తాజాగా హోలీ సందర్భంగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంటికి హోలీ సెలబ్రేషన్ కోసం తమన్న వచ్చింది. ఇంతలోనే విజయ్ వర్మ మరో హీరోయిన్ రవీనా టాండన్ తో అక్కడికి వచ్చారు. హోలీ పండుగను విజయ్ వర్మ ఆ హీరోయిన్ కలిసే జరుపుకున్నారని, అక్కడికి తమన్నా వచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విధంగా హోలీ పండుగ ఇద్దరు కలిసి జరుపుకోవాల్సింది పోయి ఆయన వేరే అమ్మాయితో జరుపుకోవడంతో వీరి మధ్య బ్రేకప్ కారణంగానే ఇద్దరు వేరువేరుగా హోలీ జరుపుకున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది.

Tamannaah Vijay Varma Break up Rumours

అంతేకాదు తమన్నా కూడా మరో హీరోతో చనువుగా ఉండటం విజయ్ వర్మ చాలా హర్ట్ అయ్యారని, దీనివల్లే తమన్నాకి బ్రేకప్ చెప్పినట్టు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ నెట్టింటా ఈ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో కొంతమంది నెటిజన్స్ ఈ ఇందులో నిజం లేదని వారిద్దరూ కలిసే ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కామెంట్లు పెడుతున్నారు.(Tamannaah)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *