Tandel Movie First Review: తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో రాజులమ్మ జాతరే.!!
Tandel Movie First Review: నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవ తరం హీరోగా పరిచయమైన వ్యక్తి. అలాంటి నాగచైతన్య ఇండస్ట్రీలో పడుతూ లేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఈయన పాన్ ఇండియా స్థాయిలో తండేలు చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. మరి సినిమా ఎలా ఉంది వివరాలు ఏంటో చూద్దాం.. తండేల్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లకు రాబోతోంది.. ఇప్పటికే చిత్ర నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ సినిమాను చూశారు..
Tandel Movie First Review
ఆయన చిత్ర బృందానికి కొన్ని సూచనలు కూడా చేశారు.. ఫైనల్ ఎడిట్ సినిమా చూడటానికి అల్లు అరవింద్ ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఒక ట్వీట్ చేశారు.. ప్రస్తుతం నా పరిస్థితి పరీక్షలు రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థుల్లా ఉందని అన్నారు.. అయితే అల్లు అరవింద్ సినిమా మొత్తం చూసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది ఆయన బయటకు చెప్పలేదు కానీ, ఆయన పెట్టిన ఎమోజీలు చూస్తే మాత్రం ఒక ఛాంపియన్ లా ఫీల్ అయినట్టు అర్థం అవుతుంది..అంటే ఈ సినిమాకు అల్లు అరవింద్ సూపర్ అనే సర్టిఫికెట్ ఇచ్చినట్టే తెలుస్తోంది.. (Tandel Movie First Review)
Also Read: Thandel: నాగ చైతన్య తొలి పాన్ ఇండియా సినిమా.. హైప్ మాములుగా లేదుగా!!
అంటే సినిమా అల్లు అరవింద్ కు బాగా నచ్చిందని గీతా ఆర్ట్స్ తెలియజేసింది. ఇక థియేటర్లలో రాజులమ్మ జాతర అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య సరసన లేడీ పవర్ స్టార్ అయినటువంటి సాయి పల్లవి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై లవ్ స్టోరీ, 100% లవ్ చిత్రాలలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాల తర్వాత తండేల్ తో మన ముందుకు రాబోతున్నారు.. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.
ఫిబ్రవరి 7వ తేదీన తమిళ్, హిందీ, తెలుగు, భాషల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ట్రైలర్ మంచి రెస్పాన్స్ లభించింది.. ఇక ఇందులో నాగచైతన్య చాలా స్పెషల్ గా కనిపించబోతున్నారట. పక్కా శ్రీకాకుళం వ్యక్తిలా కనిపిస్తూ సముద్రంలో చేపలు పట్టే జాలరి పాత్రలో అద్భుతంగా నటించారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా ఆయనకు అద్భుతమైన హిట్ ఇస్తుందని అక్కినేని అభిమానులు అంటున్నారు.(Tandel Movie First)