Tandel Movie: తండేల్ సినిమాలో ఆ ఎపిసోడ్ హైలైట్..కథలో కీలక మలుపు!!

Tandel Movie Pakistan Episode Revealed

Tandel Movie: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. Geetha Arts నిర్మిస్తుండగా, ప్రతిభావంతమైన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకీ, ఈ సినిమాలోని పాకిస్తాన్ నేపథ్య ఎపిసోడ్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Tandel Movie Pakistan Episode Revealed

ఈ చిత్రంలో భారతీయ మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుండి రక్షించే మేజర్ ఎపిసోడ్ ఉండబోతుందని ఇప్పటికే టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాల నిడివితోనే ముగుస్తుందని తెలుస్తోంది. దీనివల్ల అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. సినిమాలో ప్రధానంగా నాగచైతన్య – సాయి పల్లవి మధ్య ఎమోషనల్ లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్.

అభిమానులు మాత్రం ఈ పాకిస్తాన్ ఎపిసోడ్‌కు మరింత స్క్రీన్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. ఇందులోని యాక్షన్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్ అవుతాని భావిస్తున్నారు. కానీ, దీన్ని 20 నిమిషాలకు పరిమితం చేయడం సరైనదేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు. అయితే, కథ, పాత్రలు, టేకింగ్ అన్నీ మెప్పించేలా ఉంటే తండేల్ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *