Tandel movie: చైతు కి అంత సీన్ ఉందా.. భారీ బడ్జెట్.. భారీ రిస్క్!!

Allu Aravind Praises Nagachaitanya’s Performance in "Tandel,"

Tandel movie: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటైల్స్ మాత్రం ఆసక్తికరంగా మారాయి.

Tandel movie pre-release business update

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ‘తండేల్’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.90 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కెరీర్‌లో ఇదే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు దాంతో ఈ సినిమా క్రేజ్‌ను మరింత పెంచుతోంది.

అక్కినేని అభిమానులు ఈ సినిమా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. నాగచైతన్య గత చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, ‘తండేల్’ మీద అంచనాలు భారీగా పెరిగాయి. చందు మొండేటి దర్శకత్వం, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడం ఈ సినిమాకు మరింత పాజిటివ్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. ఈ అంశాలు చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా చేసాయి.

ప్రస్తుతం, ‘తండేల్’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కి రానుండగా, అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *