Tarun Arora: అందాల భామ అంజలా ఝవేరి భర్త ఎవరో తెలుసా..అందరికి తెలిసిన నటుడే!!


Tarun Arora: అందాల భామ అంజలా ఝవేరి ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేసింది. ఘురాన మొగుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అంజలి. అది మొదలుకొని ఈ అమ్మడు తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంజలా జవేరి అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. చందమామ రావేలో నాగార్జునతో, చూడాలని ఉంది లో చిరంజీవితో, బాలకృష్ణతో నరసింహనాయుడు, వెంకటేష్ తో దేవి పుత్రుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

Tarun Arora wife heroine Anjala Zaveri

Tarun Arora wife heroine Anjala Zaveri

ఈ భామ హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి హిట్ అందుకుంది.చివరిగా ఆమె శంకర్ దాదా కూడా MBBS సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంలో కూడా నటించింది. అప్పటి నుంచి అంజలా జవేరి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. అయితే ఆమె అందం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది. అయితే ఆమె భర్త గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

Also Read: Sri Sathya: అందరూ చిన్న గా ఉందంటున్నారు..అందుకే సర్జరీ తప్పలేదు.. బిగ్ బాస్ ఫేమ్!!

ఆయన కూడా నటుడే. అంజలా జవేరి భర్త పేరు తరుణ్ అరోరా. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి నటుడు గా నిలిచిపోయారు తరుణ్. “ఖైదీ నెంబర్ 150” సినిమాలో విలన్‌గా నటించాడు. తరుణ్ అరోరా జయ జానకి నాయక, కాటమ రాయుడు, అమర్ అక్బర్ ఆంటోని, అర్జున్ సురవరం వంటి మొదలైన చిత్రాల్లో విలన్‌గా నటించారు. ఈ స్టైలిష్ విలన్ హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అంజలా జవేరి, తరుణ్ అరోరాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు భర్తను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏదేమైనా భర్త కెరీర్ ను నిలబెడుతున్న అంజలా జవేరి కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *