మాట నిలుపుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రజలకు ఇచ్చిన హామిలే కాదు నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చిన హామీలను సమాంతరంగా నెరవేర్చే పనిలో చంద్రబాబు వ్యూహం నడుస్తోంది.
ఓ కన్ను ప్రభుత్వం ప్రజలు మరో కన్ను నాయకులు కార్యకర్తలు అనేలా చంద్రబాబు చూపు సమాంతరంగా ముందుకు వెళ్తున్నారు
మరో ప్రక్క పైశాచికంతో రెచ్చిపోయిన సోషల్ ఉన్మాదుల భరతం పడుతున్నారు యువనేత నారా లోకేష్
ఎన్నికల హామీల్లో ప్రధానంగా చూస్తే నారా లోకేష్ చేపట్టిన యువగళం హామీలు గత 8నెలలుగా పట్టాలెక్కి నడుస్తున్నాయి
చంద్రబాబు కూటమితో కలసి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు పటిష్టమైన ప్రణాళికలు వేసి 2025-26 బడ్జెట్ ప్రతిపాదన కూడా పూర్తయింది
మార్చి నెలలో ఖాళీ అయిన 5 శాసన మండలి స్థానాల్లో టీడీపీ అధినేత కసరత్తు పూర్తి చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఖాళీ అయ్యే స్థానాల్లో చంద్రబాబు ఎన్నికల సమయంలో లక్షలాది కార్యకర్తల సాక్షిగా 175 స్థానాల్లో ఆయన ప్రచారం నడిచినప్పటికి ఎమ్మెల్సీ స్థానాన్ని బహిరంగ హామీ ఇచ్చింది ఇద్దరికి మాత్రమే
రాష్ట్రం మొత్తం మీద మొదటి సారిగా పల్నాడు జిల్లా వేదికగా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఇపుడు కార్యరూపం దాల్చిందని చెప్పవచ్చు ఇప్పటికే రెండుమూడుమార్లు డాక్టర్ కొమ్మాలపాటి చంద్రబాబును కలిసినట్లు తెలుస్తుంది
రెండోది పిఠాపురం శాసన సభ స్థానాన్ని త్యాగం చేసిన టీడీపీ నేత ఎస్ వి ఎస్ వర్మకి దక్కనుంది ఎన్నికల్లో పైన ఇద్దరికీ మాత్రమే చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి విదితమే
మరో మూడు స్థానాల్లో దిగవంతనేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రంగాకు దక్కనున్నట్లు తెలుస్తోంది ఇది కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలోని రంగా అభిమానులకు మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు టీడీపీ మరింత బలపడేందుకు ఇది దోహదపడుతుందనేది కూడా సత్యం
అయితే కాపు సామాజికవర్గం నుండి జనసేన కోటాలో ఆ పార్టీ నాయకుడు నాగేంద్రబాబుకు కూడా ఎమ్మెల్సీ స్థానం ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది
టీడీపీ నుండి మిగిలిన ఒక్క ఎమ్మెల్సీ స్థానం బీసీకే అనేది పక్కా ఖచ్చితంగా చంద్రబాబు కూర్పులో బీసీ లేకుండా ఉండరనేది కూడా సత్యమే
ఏదైనప్పటికీ చంద్రబాబు మాటిచ్చిన ప్రకారం డాక్టర్ కొమ్మాలపాటి , పిఠాపురం వర్మలకి ఎమ్మెల్సీలు ఇవ్వనుండటం , బడ్జెట్ లో సూపర్ సిక్స్ కి నిధులు కేటాయించటం , గంగాధర నెల్లూరు వేదికగా రాష్ట్రంలో కార్యకర్తలను కలుస్తానని చంద్రబాబు ప్రకటన చూస్తే ఈ సారి చంద్రబాబు వ్యూహం రాజకీయ అడుగులు చాలా పక్కాగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు