KTR: కేటీఆర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న ?


KTR: కేటీఆర్ ను కలిశారు తీన్మార్ మల్లన్న. బీసీ బిల్లుపై సభలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలి అని కోరారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే… ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విజ్ఙప్తిని విన్న కేటీఆర్‌… సానుకూలంగా స్పందించారు. అనంతరం ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. దీంతో ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని ఆగ్రహించారు.

Teenmar Mallanna meets KTR

ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని ఆగ్రహించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదన్నారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అంటూ నిలదీశారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అన్నారు.

AP: పోలవరం బాధితులకు ఏపీ శుభవార్త…2026 జూన్ నాటికి ఇండ్లు !

అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా? అంటూ ఆగ్రహించారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు అన్నారు. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయ 5గంలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని తెలిపారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పారు. పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదని ఫైర్‌ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *