Telangana Assembly : గందరగోళంతో తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ హెచ్చరిక!!

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) గవర్నర్ ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “గవర్నర్ ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా చదవలేదు. 15 నెలల పాలనను 36 నిమిషాల్లో ముగించారు” అంటూ విమర్శలు గుప్పించారు.
Telangana Assembly Heated Debate Continues
దీనిపై ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ (Aad Srinivas) స్పందిస్తూ, “మా ప్రభుత్వం 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో ఉంది” అని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) స్పందిస్తూ, “దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని” విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సభలో సభాకార్యకలాపాలు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ (Prasad Kumar) సభ్యులకు శాంతంగా ఉండాలని సూచించారు. అయితే, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) డిమాండ్ చేశారు. సభలో గందరగోళం పెరగడంతో స్పీకర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
ఈ ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌కు డిమాండ్ చేయగా, బీఆర్ఎస్ శ్రేణులు తమ నేతకు మద్దతుగా నిలిచాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.