Telangana: బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి చర్చలు ?
Telangana: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దాదాపు 15 నిమిషాల పాటు బాల్క సుమన్ అలాగే వివేక్ వెంకటస్వామి చర్చలు చేశారు. ఎన్నికల్లో ఈ ఇద్దరు మధ్య పోటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ పై దాదాపు 50 వేల మెజారిటీతో వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు.

Telangana Balka Suman and Vivek Venkataswamy’s discussion
అలాంటి ఇద్దరు ప్రత్యర్ధులు బాల్క సుమన్ అలాగే వెంకటస్వామి… ఇద్దరు కూడా 15 నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడుకున్నారు. ప్రత్యర్థుల ఇద్దరి మంతనాలపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. ఈ ఇద్దరి చర్చలు చూసి… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా షాక్ అయ్యారట.
దీంతో ఇద్దరు సంభాషణ మధ్యలోకి కేటీఆర్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. సరదాగా ఆ ముగ్గురు కలిసి ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. కాగా వివేక్ వెంకటస్వామి గులాబీ పార్టీ నుంచి… బయటకు వచ్చి బిజెపి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.