Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రిజర్వేషన్లు, ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు ఈ-కేవైసీ!!

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను ఆమోదించింది. ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని నిర్ణయించింది.
Telangana Cabinet Approves Key Decisions
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్తగా అర్హులను గుర్తించే ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. రేషన్ కార్డు కలిగిన వారికి మార్చి 31లోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.ప్రజా పంపిణీ వ్యవస్థలో బోగస్ కార్డులను తొలగించడంలో ఇది కీలకంగా ఉంటుంది. కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ డీలర్లను సంప్రదించడం లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించడం ద్వారా చేయవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన వివరాలను మంత్రిమండలి చర్చించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికకు ఆమోదం తెలిపింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 90 పోస్టులను మంజూరు చేసింది. అలాగే, రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియామకం, ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు పోస్టుల మంజూరు, గురుకులాలకు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎల్-1 జాబితాలో ఉన్న అర్హులకు రీవెరిఫికేషన్ చేపడుతున్నారు. అర్హులైన వారికి నాలుగు విడతలుగా రూ.5 లక్షలు జమ చేయనున్నారు. రేషన్ కార్డు ఈ-కేవైసీని రేషన్ డీలర్ల వద్ద లేదా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.