Telangana: ఒకే వేదికపై కేటీఆర్, సీఎం రేవంత్..జగన్ మిస్సింగ్ ?
Telangana: ఒకే వేదికపై కేటీఆర్, సీఎం రేవంత్ కనిపించనున్నారు. ఇవాళ చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బృందం. అటు సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే వేదికపై కేటీఆర్, సీఎం రేవంత్ కనిపించనున్నారు. అటు దీనిపై కేటీఆర్ మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

Telangana KTR and CM Revanth will be seen on the same stage
Congress: నెల రోజుల పాటు.. ఊరూరా కాంగ్రెస్ పండుగ !
దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయని వివరించారు. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం అన్యాయం అన్నారు. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేసారు. డిలిమిటేషన్ ప్రతిపాదనను మా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.
High Court: పెట్రోల్ బంకుల్లో మోసాలు.. ఏపీ హై కోర్టు సంచలన తీర్పు ?
భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. ఈ అంశం పైన అందరము గట్టిగా కొట్లాడాలి.. వ్యతిరేకించాలి లేకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవన్నారు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని వెల్లడించారు కేటీఆర్. అయితే… దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు జగన్ మాత్రం రాలేదు.
Nara Lokesh: నారా లోకేష్ చేతిలో ఎన్టీఆర్ ప్లెక్సీ ?