Telangana: అల్లు అర్జున్‌కి ఓ న్యాయం.. కిషన్ రెడ్డికి మరో న్యాయమా?
Telangana: అల్లు అర్జున్‌కి ఓ న్యాయం.. కిషన్ రెడ్డికి మరో న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. నేరుగా తన ప్రమేయం లేకపోయినా సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి వ్యవహారంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ముప్పుతిప్పలు పెట్టించి, నానా రాద్ధాంతం చేసినట్లు రేవంత్ సర్కార్ పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు నేటిజన్స్.
Telangana One justice for Allu Arjun Another justice for Kishan Reddy
కానీ.. కిషన్ రెడ్డి తలపెట్టిన మహా హారతి కార్యక్రమంలో ఇద్దరు చనిపోతే మరోలా ప్రభుత్వం వైఖరి…. మరోలా ఉందని ఫైర్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో.. గణపతి అనే వ్యక్తితో పాటు అజయ్ అనే విద్యార్థి మృతి మృతి చెందిన సంగతి తెలిసిందే.
అయితే హుస్సేన్ సాగర్ లో ఇద్దరు మరణించినప్పటికీ కూడా…ఇంతవరకూ కేసు కాదు కదా.. అసలు తమకేమీ ఎరుగనట్టుగా మౌనం పాటిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్ రెడ్డి వ్యవహారంలో ఎందుకు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఉందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. వెంటనే అల్లు అర్జున్ తరహా లోనే కిషన్ రెడ్డి పై కూడా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.