Hyderabad land: గచ్చిబౌలి భూముల వేలం.. ప్రభుత్వ భూముల అమ్మకం ఎవరికి ప్రయోజనం?


KTR Formula E Car Race Cm revanth reddy Telangana plans auction for Hyderabad land

Hyderabad land: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఈ భూమి శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి గ్రామ పరిధిలో ఉంది. ఈ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ వేలం ద్వారా రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను సంక్షేమ పథకాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేయడానికి గడువు నిర్ణయించారు.

Telangana plans auction for Hyderabad land

ఈ భూమి హైటెక్ సిటీకి కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ నుండి 15-18 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 22 కి.మీ, మరియు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి 33 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఐటీ కంపెనీలకు సమీపంలో ఉండటంతో, భూమికి భారీ డిమాండ్ ఉంది. ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ భూమి గజానికి రూ.2 లక్షలు, ఎకరానికి రూ.50 కోట్లకు పైగా పలుకుతుంది.

ఈ భూమిని అభివృద్ధి చేసి దశల వారీగా విక్రయించనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ప్లాట్ల లేఅవుట్ డిజైన్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) ద్వారా కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు ఆహ్వానించారు. క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (QCBS) పద్ధతి ద్వారా బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నారు.

ఈ వేలం ద్వారా వచ్చే రూ.20,000 కోట్లను ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం ఉపయోగించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాల అమలుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈ ప్రయత్నం ద్వారా ప్రభుత్వం భారీ ఆదాయాన్ని సంపాదించి, రాష్ట్ర అభివృద్ధికి మరింత మద్దతు అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *