Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం..బతుకమ్మ ఎక్కడా ?
Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం రాజుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎక్కడా ? అంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్… తెలంగాణ తల్లి రూపం విడుదల చేసింది. ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Telangana Thalli
Telangana Thalli Will Lanched on dec 9th
ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. అటు చేతిలో మొక్కజొన్న, వరి కంకులు ఉన్నాయి. తెలంగాణ తల్లి మెడలో 3 ఆభరణాలు ఉన్నాయి. కాళ్లకు మెట్టెలు, పట్టీలు ఉండటం జరిగింది. ఈ నెల 9న సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ చేయనున్నారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎక్కడా ? అంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఉండేలా ఛత్తీస్ ఘడ్ మహతారీ పోలికలతో నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఉందని కూడా కొందరు అంటున్నారు.Telangana Thalli
Also Read: Couple Love: కొత్తగా పెళ్లయిన వారు… ఈ టిప్స్ పాటిస్తే… పండగే ?
ఇక దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు. ఈ నెల 9 న సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఉంటాయన్నారు. గ్రామ స్థాయి నుండి.. రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి.. సోనియా గాంధీ అన్నారు. మహిళల పండగ…రైతుల పండగ…. యువకుల పండగ అని కొనియాడారు. పదేళ్ల లో ఇవ్వలేని ఉద్యోగాలు.. మేము యేడాది లో ఇచ్చామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం అద్భుతంగా ఉందని.. తెలంగాణ సంస్కృతి ఒట్టిపడేలా.. విగ్రహం తయారు చేసినట్లు వివరించారు. Telangana Thalli