Shiva Balaji: భార్యతో విడాకులు తీసుకోబోతున్న తెలుగు బిగ్ బాస్ 1 విన్నర్..?


Shiva Balaji: సినిమా ఫీల్డ్ లో పెళ్లి, విడాకులు అనే పదం చాలా కామన్ గా తీసుకుంటారు.. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఈ తంతు మరింత పెరిగిపోయింది. పెళ్లి చేసుకొని రెండు మూడేళ్లయిన గడవకముందే విడాకుల బాట పట్టి ఎవరికి వారే దూరం అవుతున్నారు. కొంతమంది అయితే పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇదే తరుణంలో సీనియర్ నటుడు అయినటువంటి శివబాలాజీ కూడా విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై శివబాలాజీ దంపతులు ఏమన్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Telugu Bigg Boss winner Shiva Balaji who is going to divorce his wife

Telugu Bigg Boss winner Shiva Balaji who is going to divorce his wife

శివ బాలాజీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోగా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఓ మోస్తారుగా దూసుకుపోతున్నారు. అంతేకాకుండా ఈయన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చి మొదటి విజేతగా నిలిచారని చెప్పవచ్చు. అలాంటి ఈయన తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే హీరోయిన్ మధుమితను పెళ్లి చేసుకున్నారు.. (Shiva Balaji)

Also Read: Posani Krishna Murali: అమ్మాయితో రవితేజ తమ్ముడు నా రూమ్ లో రహస్యంగా ఎఫైర్ నడిపించి.?

ఇలాంటి వీరు విడాకులు తీసుకోబోతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించినటువంటి మధుమిత నా భర్త అప్పుడప్పుడు నన్ను విడాకులు తీసుకుందామని బెదిరించేవాడు, కానీ నేనే కూల్ గా హ్యాండిల్ చేసి పిల్లల గురించి ఆలోచించమని చెబుతూ సర్ది చెప్పాను.. ఇక సమస్యల నుంచి దూరమైపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. సంసార జీవితంలో మనస్పర్ధలు, విభేదాలు రావడం సహజం, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి తప్ప విడాకులు అనే పదాన్ని లైఫ్ లోకి రానివ్వకూడదని చెప్పుకొచ్చింది.

Telugu Bigg Boss winner Shiva Balaji who is going to divorce his wife

ఇక దీనిపై శివబాలాజీ కూడా స్పందిస్తూ ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లయి రెండు మూడేళ్లు గడవకముందే విడాకుల బాట పడుతున్నారని, చిన్నచిన్న విషయాలకే అపార్థం చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇలా కాకుండా విడాకులు ఎందుకు తీసుకుంటున్నాం మన మీద ఎవరు ఆధారపడి ఉన్నారని ఒకసారి ఆలోచిస్తే విడాకులనే విషయాన్ని మర్చిపోతారని చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారు అనే రూమర్ కు చెక్ పెట్టారు.(Shiva Balaji)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *