Telugu directors: డైరెక్టర్ లు ఒకే సంస్థ లో వరుస సినిమాలు చేయడానికి కారణం అదేనా!!

Telugu directors: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ డైరెక్టర్స్ ఒక్కటే నిర్మాణ సంస్థలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇది ఆ డైరెక్టర్స్ కంఫర్ట్ లెవల్ మాత్రమేనా? లేక తమ క్రియేటివ్ ఫ్రీడమ్‌పై కంట్రోల్ పెడుతున్నదా? అనేది ఆసక్తికరమైన చర్చ. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, సుకుమార్, శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి వంగా వంటి టాప్ డైరెక్టర్లు తమ ప్రాజెక్ట్స్‌ను ఒకే బ్యానర్‌లో మాత్రమే లాక్ చేస్తున్నారు.
Telugu directors working with same producers
త్రివిక్రమ్ విషయానికి వస్తే, “జులాయి” (2012) నుంచి తాజా “అల్లు అర్జున్ ప్రాజెక్ట్” వరకు అన్నీ హారిక హాసిని క్రియేషన్స్‌లోనే రూపొందాయి. అనిల్ రావిపూడి కెరీర్‌లో 8 సినిమాల్లో 6 దిల్ రాజు బ్యానర్‌లో వచ్చాయి. శేఖర్ కమ్ముల కూడా “లవ్ స్టోరీ” తర్వాత “కుబేరా” సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP లో చేస్తున్నారు. ఇక చందూ మొండేటి కూడా తండేల్ తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్ లోనే సినిమా ప్లాన్ చేస్తున్నారు.
సుకుమార్ విషయానికి వస్తే, “రంగస్థలం” నుంచి “పుష్ప 1 & 2” వరకూ మైత్రి మూవీ మేకర్స్‌లోనే ఉన్నారు. ఆయన తాజా చరణ్ ప్రాజెక్ట్ కూడా ఇదే బ్యానర్‌లో చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా కూడా టీ సిరీస్ భూషణ్ కుమార్‌తో వరుసగా “కబీర్ సింగ్, యానిమల్, స్పిరిట్, బన్నీ మూవీ” చేస్తుండటం విశేషం.
ఈ ట్రెండ్ డైరెక్టర్స్‌కి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, కంట్రోల్ ఇస్తుందా? లేక క్రియేటివిటీని పరిమితం చేస్తుందా? అనేది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ, ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్‌కు స్టార్ డైరెక్టర్స్ అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది!