Thaman: తమన్ శాడిజం.. హీరో పై పగబట్టి చుక్కలు చూపించి.?
Thaman: ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ హీరో పై పగ పట్టారా.. నిజంగానే ఆ హీరోకి సినిమా షూటింగ్లో చుక్కలు చూపించారా..ఇంతకీ అంత శాడిజంగా మారిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా సౌత్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఎస్ఎస్ తమన్ గతంలో బాయ్స్ అనే సినిమాలో కీ రోలీ పోషించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించారు.

Thaman is angry with the hero
ఇదే ఆయన మొదటి సినిమా కానీ ఈ సినిమాలో నటించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సిద్ధార్థ్ కంటే నేను ఎందులోను తక్కువేం కాదు అని పదేపదే సిద్ధార్థ్ తో పోటీ పడుతూ ఉండేవారట. అంతేకాదు వాడు హీరో అయితే ఏంటి హీరోయిన్ అయితే నాకేంటి సిద్ధార్థ్ కంటే నేనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా.. నాకు వాడితో అవసరం లేదు అన్నట్లుగా అసూయ చూపించేవాడట.(Thaman)
Also Read: Laila: కొడుకుని పట్టుకొని కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ లైలాకి అవమానం.?
అంతేకాదు షూటింగ్ జరుగుతున్న సమయంలో క్యారవాన్ లో కరెంట్ కట్ చేయడం,బాత్రూం పైపులు కట్ చేసి నీళ్లు రాకుండా ఆట పట్టించడం వంటి ఎన్నో ఇబ్బందికర పనులు చేశాడట.అంతేకాదు సినిమా షూటింగ్ సమయంలో సిద్ధార్థ కు కాస్ట్లీ సాక్స్ ఇచ్చి తమన్ కి కాస్త కాస్ట్ తక్కువగా ఉండే సాక్సులు ఇవ్వడంతో డైరెక్టర్ తో గొడవ పెట్టుకున్నారట.

అయితే ఈ సినిమాకు డైరెక్టర్గా చేసిన శంకర్ అంతగా పట్టించుకోకపోయినప్పటికి ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన అరివళగన్ ప్రతిసారి తమన్ ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడట.వాడు హీరో అయితే నాకేం అవసరం. నేనే వాడి కంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నాను కాబట్టి నేనే గొప్ప అనే తమన్ చెప్పేవాడట.అయితే ఇవన్నీ ఒక మంచి మెమొరీస్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆది పినిశెట్టి నటించిన శబ్దం మూవీ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.(Thaman)