Thandel Review: నాగచైతన్య ‘ తండేల్’ రివ్యూ అండ్ రేటింగ్!!

మూవీ: తండేల్ (Thandel Review)
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, దివ్య, ఆడుకాళం, కరుణాకరన్
సినిమాటోగ్రఫీ: షామ్
ఎడిటింగ్: నవీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: బన్నీ
విడుదల తేదీ: ఫిబ్రవరి 07, 2025
Thandel Review: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పకుడు గా వ్యవహరించారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్ష ద్వారా వివరంగా తెలుసుకుందాం.
Thandel Review And Rating
కథ : శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు (అక్కినేని నాగచైతన్య) సముద్రంలో చేపల వేట చేస్తూ తన తోటి వేటగాళ్లకు అండగా నిలుస్తాడు. సత్య (సాయి పల్లవి) అంటే రాజుకు ప్రాణం, రాజు అంటే సత్యకు అంతే. చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట, అనుకోని పరిణామాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. చేపల వేటకు వెళ్లిన రాజును కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు, అతను పరాయి దేశంలో జైలుపాలవుతాడు. తన ప్రియుడిని రక్షించేందుకు సత్య ఎలాంటి ప్రయత్నాలు చేసిందనేదే ఈ సినిమా కథాంశం.
సాంకేతిక నిపుణులు: ‘తండేల్’ సినిమా కు కథ పెద్ద బలం. ఎమోషనల్ లవ్ ట్రాక్ అందరిని ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి పాత్రల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. వారి మధ్య ఎమోషన్ ను దర్శకుడు చందూ మొండేటి అద్భుతంగా మలిచారు.హృదయాన్ని తాకే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, బలమైన క్యారెక్టర్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. షామ్ దత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రేమకథకు తగినట్టు విజువల్స్‌ను అందంగా మలిచారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో బీజీఎమ్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ పరంగా ల్యాగ్ సీన్స్ తొలగించి సినిమాను క్రిస్ప్‌గా నడిపించారు. నిర్మాత బన్నీ వాసు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి.
నటీనటులు: నాగచైతన్య నటన హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ప్రేమికుడిగా, మానసికంగా నరకం అనుభవించే వ్యక్తిగా పాత్రలో ఒదిగిపోయారు. ఆయన హావభావాలు, ఎమోషనల్ సన్నివేశాల్లోని నటన ప్రేక్షకుల మనసును దోచుకుంటాయి. సాయి పల్లవి తన పాత్రలోని వేదనను కేవలం తన కళ్లతోనే పలికించగలిగారు, ఆమె పెర్ఫార్మెన్స్ సహజంగా, భావోద్వేగాలతో నిండిపోయి ఉంది. దివ్య పిళ్ళై, నరేన్, కరుణాకరన్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రతీ నటుడు తన పాత్రకు న్యాయం చేస్తూ, కథలోని భావోద్వేగాలను మరింత బలంగా చూపించడంలో తోడ్పడ్డారు. ‘తండేల్’లో నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం.
ప్లస్ పాయింట్స్:
నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ
కథ, స్క్రీన్ ప్లే
డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
తీర్పు: డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా బలమైన భావోద్వేగాలు, ఫీల్ గుడ్ సన్నివేశాల తో తండేల్ సినిమా ఉంది. ఇవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాయి. మంచి కంటెంట్ తో పాటు టేకింగ్, మేకింగ్ సినిమాకు మేలు జరిగింది. అయితే, స్క్రీన్ ప్లేలో స్లో నేరేషన్ చిన్న మైనస్‌గా అనిపించినా, చైతూ, సాయి పల్లవి తమ అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. చందూ మొండేటి దర్శకత్వం కూడా ఎంతో బాగుంది.
Rating: 3/5