Shiva Movie:శివ మూవీలో హీరోగా ఆ స్టార్..కానీ నాగార్జున ఎలా వచ్చాడంటే.?

Shiva Movie: తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఇంతటి గుర్తింపు పొందాడు.. అలాంటి నాగర్జున కెరియర్ ఒక్కసారిగా మార్చేసినా మూవీ శివ. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే జనాలు ఎగబడి చూస్తారు. ది గ్రేట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి శివ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత నాగార్జున క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
That star as the hero in Shiva Movie but how did Nagarjuna come
ఇక ఆర్జీవి మేకింగ్ డైరెక్షన్ చూసి అంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికీ సినిమాలోని పాటలు ఏదో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లోనే ఈ మూవీ ఐదు కోట్ల వరకు షేర్ రాబట్టింది అంటే ఎంతటి హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ చిత్రం ముందుగా నాగార్జునతో ప్లాన్ చేయలేదట. దీనికి మరో హీరో అనుకున్నారట. ఈ సినిమా సమయంలో నాగార్జున ఎక్కువగా రొమాంటిక్ చిత్రాలు చేస్తూ హిట్స్ సాధిస్తున్నాడు. (Shiva Movie)
Also Read: Keerthy Suresh: ఆస్తి కోసమే బిజినెస్ మ్యాన్ తో.. పెళ్లికి ముందే అలా చేస్తున్న కీర్తి సురేష్.?
ఈ టైంలో ఆయనతో మాస్ సినిమా అంటే ప్రేక్షకులకు కరెక్ట్ కాదని భావించారట. దీంతో వెంకటేష్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలని భావించి ముందుగా రామానాయుడుకు స్టోరీ వినిపించారట. కానీ కథ అంత విన్నాక రామానాయుడు మా అబ్బాయి ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో చేస్తూ ముందుకు వెళుతున్నాడు, ఈ టైంలో మాస్ యాంగిల్ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని సందేహ పడ్డారట, ఈ సినిమా నాగార్జున కైతే కరెక్ట్ గా సెట్ అవుతుందని రామానాయుడు సలహా ఇచ్చారట.

వెంటనే ఆర్జీవి ఈ కథను నాగార్జునతో చెప్పడంతో ఆయన ఓకే చెప్పారట. వెంటనే సినిమాలు తెరకెక్కించి అద్భుతమైన హిట్ కొట్టారు నాగార్జున ఆర్జీవి.. ఈ విధంగా వెంకటేష్ చేయాల్సిన చిత్రం నాగార్జున చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని తెలుస్తోంది..ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నా సామిరంగా అనే సినిమాతో అద్భుతమైన హిట్ సాధించారు నాగార్జున. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర చిత్రంలో కూడా చేస్తున్నారు.(Shiva Movie)