Singer Kalpana: వాళ్లు నా మొహం మీద ఉమ్మేశారు.. అందుకే సూసైడ్.. సింగర్ కల్పన దీనగాధ..?
Singer Kalpana: తెలుగు ఇండస్ట్రీలోని ఫేమస్ ఫిమేల్ సింగర్స్ లో కల్పన టాప్ 5లో ఉంటుందని చెప్పవచ్చు. ఈమె పాడిన ఎన్నో పాటలు, రికార్డులు క్రియేట్ చేశాయి. అలాంటి కల్పన ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే మనస్తత్వం. ఏ విషయం అయినా ముక్కు సూటిగా మాట్లాడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అలాంటి కల్పన తాజాగా తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలైంది. ఈ విషయం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో రావడంతో ఇండస్ట్రీ వర్గాలంతా ఆమెను ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

Thats why suicide Singer Kalpana failure lifestory
అలాంటి ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా కల్పన గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు రకరకాల కారణాలు రాస్తూ వైరల్ చేస్తున్నారు. మరి ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కుటుంబ పరిస్థితులే కారణాలు కావచ్చు కానీ ఆత్మహత్యాయత్నం అనేది కల్పనకు ఇది మొదటిసారి కాదట. రెండవసారి అని తెలుస్తోంది. మరి మొదటిసారి ఎప్పుడు ప్రయత్నం చేసింది వివరాలు చూద్దాం.. ఈ సింగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయట పెట్టింది. నేను గాయనిగా అవకాశాలు పొందుతున్న తరుణంలోనే మళ్లీ వర్తమాన సింగర్ తరహాలో మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొన్నాను. (Singer Kalpana)
Also Read: Singer Kalpana: మా అమ్మది సూసైడ్ కాదు.. కొత్త అనుమానాలు పుట్టిస్తున్న సింగర్ కల్పన కూతురు.?
అందులో మొదటి స్థానంలో నిలిచానని చెప్పుకొచ్చింది. గాయనిగా మంచి పేరు ఉన్నప్పుడు ఈ సింగింగ్ కాంపిటీషన్ లో ఎందుకు పాల్గొన్నారని యాంకర్ ప్రశ్నించగా.. ఆ టైంలో నా జీవితంలో అన్నీ నేను కోల్పోయాను, నా వైవాహిక జీవితం చాలా ఇబ్బందుల పాలైంది.. నాకు కూతురు ఉంది సంపాదన లేదు.. ఇక చావే శరణ్యం అనుకున్నాను.. అప్పుడే దేవుడిలా సింగర్ చిత్రమ్మ నా ఆలోచనలు మార్చి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి పుట్టావా, నీలో ఎంతో టాలెంట్ ఉంది దాన్ని బయటపెట్టి మళ్లీ జీవితంలో ముందుకు వెళ్ళు అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాదు మలయాళంలో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతోంది అక్కడికి వెళ్లి నీ టాలెంట్ మరోసారి నిరూపించుకో అని చెప్పగానే కాంపిటీషన్ లో కల్పనా పాల్గొని విజేతగా నిలిచింది. ఈ టైంలో కల్పనాను చాలామంది గాయనిగా కొనసాగుతూ మళ్లీ ఈ సింగింగ్ కాంపిటీషన్ కు రావడం ఏంటి తూ నీది, బ్రతుకేనా, డబ్బులు అంటే అంత కక్కుర్త అంటూ చాలామంది నిందించారట. అయినా తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమె ఆ ప్రోగ్రాం లో పాల్గొని విజేతగా నిలిచి మళ్లీ తన లైఫ్ లీడ్ చేస్తూ ముందుకు వచ్చింది. తాజాగా తన కుటుంబంలో ఏర్పడిన కొన్ని కలతల వల్ల ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.(Singer Kalpana)