Raviteja:పెళ్ళిలో రవితేజ కాళ్లు కడిగిన నటుడు..?
Raviteja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో రవితేజ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.. ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా హీరోగా నిలదొక్కు కున్నారు. అలాంటి రవితేజ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా నటించడమే కాదు దూరిపోతారని చెప్పవచ్చు.. అలాంటి హీరో రవితేజకు మరియు రాజా రవీంద్రకు మధ్య మొదటి నుంచే మంచి బంధం ఉంది..

The actor who washed Raviteja feet in the wedding
రవితేజ రాజా రవీంద్రాను మామా అని పిలుస్తూ ఉంటారట.. కానీ అనుకోకుండా రాజా రవీంద్ర రవితేజ మధ్య ఒక గొడవ జరిగిందని రవితేజకు మేనేజర్ గా ఉన్న రాజా రవీంద్రాను ఉద్యోగం నుంచి తీసేసారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.. దీనికి కారణం వీరి మధ్య గొడవ జరిగిందా ఏంటి అనేది తాజాగా రాజా రవీంద్ర క్లారిటీ ఇచ్చారు.. రాజా రవీంద్ర కూడా పలు సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (Raviteja)
Also Read: Mahesh Babu: దురదృష్టం అంటే ఇదే.. మహేష్ ఆ సినిమాని వదులుకున్నాడా.. నిజం ఏంటంటే.?
నిప్పురవ్వ ఈయన మొదటి సినిమా. కేవలం సినిమాల్లో హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో కీలకపాత్రలు పోషిస్తూ మేనేజర్ గా కూడా పనిచేసేవారు. అలా రవితేజకు మేనేజర్ గా చాలా ఏళ్ల పాటు పని చేశారు. ఇలా రవితేజ రాజా రవీంద్ర మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.. ఒక్కోసారి రవితేజ మామ నా పెళ్ళికి నువ్వే కాళ్లు కడగాలి అని అనేవారట. అంతేకాదు రవితేజ పెళ్లిలో రాజా రవీంద్రాని కాళ్లు కూడా కడిగారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా వీరి మధ్య బంధం ఉంది.

కానీ ఒకరోజు రవితేజ రాజా రవీంద్రని పిలిచి ఇక మేనేజర్ గా నా వద్ద పనిచేయడం వద్దని చెప్పారట. దీంతో రాజా రవీంద్ర షాక్ అయిపోయి అసలు నేనేం మిస్టేక్ చేశాను ఎందుకిలా అన్నారని చాలా ఆలోచన చేశారట.. కానీ ఎందుకు తీసేసారు అనేది రవితేజ అస్సలు చెప్పలేదట. నాకు ఇప్పటివరకు కూడా ఆయన మేనేజర్ పోస్ట్ నుండి ఎందుకు తీసేశారో తెలియదని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ అప్పటినుంచి మా మధ్య రిలేషన్షిప్ ఉందని ఇప్పటికి కూడా మేము కలుసుకుంటామని అన్నారు..(Raviteja)