Savitri: కష్టకాలంలో సావిత్రిని కాపాడిన నటి.. ట్రైన్ నుండి మెడపట్టి గెంటేస్తే.?

Savitri: కష్టాల్లో ఉన్నవారికి సావిత్రి కాదనకుండా సహాయం చేసే ఉన్నతమైన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహిళా అని ఇప్పటికే సావిత్రితో సహాయం పొందిన ఎంతోమంది గుర్తు చేసుకుంటారు. అయితే ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సినీ ఇండస్ట్రీ మాత్రం ఆమెను మరువలేదు. ఆమె గుర్తుగా మహానటి అనే బయోపిక్ ని కూడా తెరమీదకి తీసుకొచ్చారు. అయితే అలాంటి సావిత్రి ఎంతోమందికి సహాయం చేసి దాన గుణం కలిగిన మహిళగా పేరు తెచ్చుకుంది.
The actress who saved Savitri in difficult times
అయితే సావిత్రి ఎంతో మందికి సహాయం చేసి మర్చిపోయింది కానీ ఆమెకు సహాయం చేయడానికి చివరి రోజుల్లో ఎవరు కూడా ముందుకు రాలేదు. ముఖ్యంగా అడిగిన వారికళ్లా సావిత్రి నమ్మి వారికి అవసరాలు తీర్చింది.కానీ సావిత్రి అవసరాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదట. అయితే సావిత్రి ఓ రోజు ఒంగోలులో జరిగే ఒక ఈవెంట్ కి తన అసిస్టెంట్ తో వెళ్లి చివరికి ఒంగోలులో ట్రైన్ ఎక్కిందట.(Savitri)
Also Read: Pooja Hegde: ఆ హీరోతో పూజ హెగ్డే ఎఫైర్.. స్విమ్మింగ్ చేస్తూ రొమాన్స్.?
అయితే అప్పటికే తనని ఈవెంట్ కి పిలిచిన వారు ట్రైన్ టికెట్ బుక్ చేస్తారని అనుకున్న సావిత్రి ట్రైన్ టికెట్ కొనుక్కోకుండానే ట్రైన్ ఎక్కిందట.ఆ టైంలో టిసి వచ్చి మీ టికెట్ ఇవ్వండి అని అడగగా నా దగ్గర లేదండి ఈవెంట్ అరేంజ్ చేసిన వాళ్ళు టికెట్ కొంటారని అనుకున్నాను అని చెప్పిందట.ఆ టైంలో సావిత్రి దగ్గర డబ్బులు కూడా లేవట. కానీ టీసి మాత్రం ఫైన్ కట్టండి విడిచి పెట్టేదే లేదని ట్రైన్ నుండి దిగిపోవాలి అన్నట్లుగా మెడపట్టి గెంటేసినట్లుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారట.

అయితే ఈ మాటలన్నీ విన్న నటి కె. విజయ సావిత్రి వాయిస్ లాగా ఉంది అని వెంటనే సావిత్రమ్మను చూసి పరిగెత్తుకొని వచ్చి టీసీ కి డబ్బులు కట్టి ఆ సమయంలో కాపాడిందట. అయితే విజయ మంచి మనసుని పొగిడిన సావిత్రి మీ రుణం తీర్చుకోలేను నెక్స్ట్ డేనే మీ ఇంటికి డబ్బులు పంపిస్తాను అని చెప్పిందట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన మరుసటిరోజే విజయ కు ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని మరీ సావిత్రి తన ట్రైన్ టికెట్ కి ఇచ్చిన డబ్బులను విజయకు పంపించిందట.(Savitri)