Samantha: సమంత వల్ల విడిపోయిన పచ్చని జంట.. అంత పెద్ద తప్పు చేసిందా.?
Samantha: ఏంటి సమంతే విడాకులు తీసుకుందంటే సమంత వల్ల కూడా మరో పచ్చని జంట విడిపోయిందా.. ఇదెక్కడి వార్త అనుకుంటారు చాలామంది ఈ టైటిల్ చూసి.. కానీ ఆ మధ్యకాలంలో ఆ హీరోయిన్ విడాకుల విషయంలో సమంత పేరే గట్టిగా వినిపించింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అమలాపాల్.. మరి అమలాపాల్ విడాకులకి సమంతకి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే..

The couple who got separated because of Samantha
అమలాపాల్ పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ తో పెళ్లి చేసుకుంది.చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకునే ముందు ఈ కండిషన్స్ ఉంటాయి. అలా అమలాపాల్ కూడా కండిషన్స్ మీదే పెళ్లి చేసుకుంది.కానీ ఆ కండిషన్స్ ని అతిక్రమించి సినిమాల్లో నటించడం వల్లే గొడవల కారణంగా విడిపోవలసి వచ్చింది. అయితే వారికీ గొడవలు వస్తే సమంత వీరి మధ్య ఏం చేస్తుందని మీకు డౌట్ రావచ్చు.(Samantha)
Also Read: Rajinikanth: రజినీకాంత్ కెరీర్ కి మచ్చ..ఆ హీరోయిన్ తో ఒకే రూమ్లో దొరికిపోయి.?
ఇక అసలు విషయం ఏమిటంటే..పెళ్లి తర్వాత బోల్డ్ గా నటించకూడదని అమలాపాల్ భర్త కండిషన్ పెట్టాడట. కానీ అమలాపాల్ మాత్రం వినలేదు. అలా పెళ్లి తర్వాత వచ్చిన కొన్ని సినిమాల లో నటించింది.అలా ధనుష్ హీరోగా చేసిన వడ చెన్నై సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా సమంతని అనుకున్నారట. కానీ సమంత మాత్రం ఈ కథకి నేను సెట్ అవ్వను అమలాపాల్ అయితే బాగుంటుంది అని చెప్పడంతో డైరెక్టర్ అమలపాల్ కి కథ చెప్పారు.

ఇక కథ బాగా నచ్చిన అమలాపాల్ ఈ సినిమా చేసిందట.అయితే ఈ సినిమా కారణంగానే అమలాపాల్ విజయ్ మధ్య గొడవలు వచ్చి విడిపోయారట. అప్పట్లో ధనుష్ మూవీ లో సమంత అమలా పాల్ ని తీసుకోమని చెప్పడం వల్లే అమలాపాల్ అందులో నటించి భర్తతో విడిపోవలసి వచ్చింది అని, దీనికి పరోక్ష కారణం సమంతనే అంటూ అప్పట్లో కొన్ని వార్తలు కోలీవుడ్లో వినిపించాయి.(Samantha)