Prabhas: ప్రభాస్ తో 75 సార్లు సినిమా తీసే ఛాన్స్ మిస్ అయిన డైరెక్టర్.?


Prabhas: ఒక హీరోతో ఒక డైరెక్టర్ రెండు మూడు సార్లు కథ చెప్తే ఏదో ఒక కథకు ఓకే చెబుతాడు. కానీ ప్రభాస్ కి మాత్రం ఈ డైరెక్టర్ ఏకంగా 75 సార్లు కథ చెప్పాడట. కానీ ఒక్కసారి కూడా సినిమా చేసే అవకాశం రాలేదట. మరి ఇంతకీ ప్రభాస్ కు 75 సార్లు కథ చెప్పి నిరాశ పడ్డ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ రేంజ్ ప్రస్తుతం ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఈయన కూడా ఒక మామూలు హీరోనే.

The director who missed the chance to make a film with Prabhas 75 times

The director who missed the chance to make a film with Prabhas 75 times

కానీ ఈయన చేసిన సినిమాల కారణంగా ఈయనకు ఇంత పెద్ద స్టార్డం వచ్చింది.బాహుబలి తర్వాత ఈయన ఇమేజ్ ఎక్కువగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ప్రభాస్ కి ఒక డైరెక్టర్ ఏకంగా 75 సార్లు కథ చెప్పారట. ఆయన ఎవరయ్యా అంటే నటుడు డైరెక్టర్ అయినటువంటి అమ్మా రాజశేఖర్.. అమ్మా రాజశేఖర్ అంటే ఒకప్పుడు మంచి నటుడిగా డైరెక్టర్.. అలాంటి అమ్మ రాజశేఖర్ స్టార్ హీరో ప్రభాస్ కి ఏకంగా 75 సార్లు కథ చెప్పారట.. కానీ చేయలేకపోయారట.. ( Prabhas)

Also Read: Prabhas: హీరోలంతా కుర్చీపై.. ప్రభాస్ మాత్రం నేలపై.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

అమ్మ రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రభాస్ కి ఏకంగా 75 సార్లు కథ చెప్పాను. ఆ స్టోరీ గనుక తెరకెక్కితే చాలా అద్భుతంగా ఉండేది. కానీ నేను కథ చేద్దాం అనుకున్న సమయంలో ప్రతిసారి ఏదో ఒకటి అడ్డు వచ్చింది. ఇక నేను ఈ సినిమాలు చివరిగా తెరకెక్కిద్దామనుకున్న సమయంలో వైవిఎస్ చౌదరి సినిమాలో భాగమయ్యారు. దాంతో సైలెంట్ అయిపోయాను.

The director who missed the chance to make a film with Prabhas 75 times

అలా డార్లింగ్ తో ఏకంగా 75సార్లు సినిమా మిస్ అయ్యాను. అలాగే వెంకటేష్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశాన్ని మిస్ అయ్యాను.వెంకటేష్ తో చేసే సమయంలో ఓంకార్ నన్ను ఢీ షో కి రమ్మని ఎక్కువ అమౌంటు రెమ్యూనరేషన్ గా ఇవ్వడంతో ఢీ షో కి వెళ్లి పోయాను.అలా ఆయనతో కూడా సినిమా ఛాన్స్ మిస్ అయ్యాను అంటూ అమ్మా రాజశేఖర్ చెప్పుకోచ్చారు.( Prabhas)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *