Mamitha Baiju:’ప్రేమలు’ హీరోయిన్ ని టార్చర్ చేసిన డైరెక్టర్.. దాని కోసం షూటింగ్లోనే.?
Mamitha Baiju: ప్రేమలు అనే మలయాళ మూవీతో సౌత్ లో ఓవర్ నైట్ లో హీరోయిన్ గా మారిపోయింది మమితా బైజు.. ఈ సినిమాలో మమిత బైజు యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయిపోయారు. అలా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన మమిత బైజుని ఓ స్టార్ డైరెక్టర్ టార్చర్ చేసినట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే బాలా.. గతంలో సూర్యతో డైరెక్టర్ బాల వనంగాన్ అనే ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
The director who tortured Heroine Mamitha Baiju
కానీ ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తయ్యాక హీరో, డైరెక్టర్ మధ్య విభేదాలు రావడంతో సూర్య ఈ సినిమా నుండి తప్పుకున్నారు.ఆ తర్వాత ఈ సినిమాకి అరుణ్ విజయ్ ని హీరోగా తీసుకున్నారు డైరెక్టర్.ఇక షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా అజిత్ సినిమా విడాముయర్చి విడుదలవుతుండడంతో కాస్త వెనక్కి తగ్గుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే..ఈ సినిమాలో మొదట సూర్యకి హీరోయిన్గా కీర్తి సురేష్ ని అలాగే సూర్య చెల్లెలి పాత్రలో మమిత బైజు ని తీసుకున్నారు.( Mamitha Baiju)
Also Read: National Crush Rashmika: కుక్క బిస్కెట్ లు తిన్న రష్మిక..సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరో!!
కానీ సూర్య ఈ మూవీ నుండి తప్పుకోవడంతో కీర్తి సురేష్ మమిత బైజు ఇద్దరు కూడా తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే గతంలో మమిత బైజుపై డైరెక్టర్ బాలా చేయి చేసుకున్నట్టు,టార్చర్ చేసినట్టు వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలు వినిపించడానికి కారణం ఓ ఇంటర్వ్యూలో బాల సార్ నన్ను కొట్టడానికి చెయెత్తారు అంటూ మమిత చెప్పింది.కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొంత మంది ఆ వీడియో పూర్తిగా చూడకుండానే మమిత బైజుని డైరెక్టర్ బాలా కొట్టారు టార్చర్ చేశారు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. దీనిపై మమిత కూడా క్లారిటీ ఇచ్చి మీరు పూర్తి వీడియో చూడలేదని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ చెప్పింది.
అలాగే వనాంగన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలా ఈ విషయం గురించి మాట్లాడుతూ..నేను మమిత బైజూపై చేయి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ అందులో నిజం లేదు .అయితే షూటింగ్ స్పాట్లో మమిత బైజుకి ముంబై నుండి వచ్చిన మేకప్ మ్యాన్ మేకప్ వేసింది. కానీ నాకు మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం తెలియక మమిత మేకప్ వేసుకొని షూట్ కి రావడంతో ఆమె పై కోప్పడి నీకు మేకప్ ఎవరు వేశారు అని కొట్టడానికి చెయ్యి ఎత్తినట్టు చెయ్యి లేపాను అంతే.కానీ దానికే నేను కొట్టాను అంటూ వార్తలు క్రియేట్ చేశారు. అయినా ఆ అమ్మాయి ని నేనెందుకు కొడతాను.ఆ అమ్మాయి నా కూతురు వయసుది. దాన్ని నేనెందుకు కొడతాను అంటూ డైరెక్టర్ బాలా క్లారిటీ ఇచ్చారు.( Mamitha Baiju)