Akhil-Zainab: అఖిల్ జైనబ్ ల లవ్ స్టోరీ వెనుక ఆ హీరో భార్య హస్తం..?
Akhil-Zainab: ఏంటి అఖిల్ జైనబ్ లు కలవడానికి,వారిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఆ హీరో భార్యనా? ఆ హీరో భార్య వాళ్లే అఖిల్ జైనబ్ లు మొదటిసారి కలుసుకున్నారా.. ఇంతకీ అఖిల్ జైనబ్ లను కలిపిన ఆ హీరో భార్య ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని అఖిల్ జైనబ్ రావడ్జి ఇద్దరి ప్రేమాయణం దాదాపు 6 సంవత్సరాలుగా కొనసాగుతుందని, కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదని తెలుస్తోంది.
The hand of the hero wife behind the love story of Akhil-Zainab
అయితే చాలామంది హీరోలకి సంబంధించి ఎన్నో పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తారు.ఎంతో మంది హీరోలపై ఇలాంటి ప్రేమ రూమర్స్, ఎఫైర్ రూమర్స్ కూడా వినిపించాయి.కానీ శ్రీయా భూపాల్ తో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నాక అక్కినేని అఖిల్ పై ఒక్క ప్రేమ వార్త కూడా వినిపించలేదు. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేశారు జైనబ్ రావడ్జిని.. (Akhil-Zainab)
Also Read: Zainab: ఆ హీరో ని పెళ్లి చేసుకోవాల్సిన జైనబ్.. కానీ అఖిల్ కి భార్యగా.. ఎక్కడ చెడిందంటే.?
అయితే జైనబ్ అఖిల్ ఇద్దరు కలుసుకోవడానికి రానా భార్య మిహికా బజాజ్ కారణమైందట. అయితే రానా భార్య మిహికా బజాజ్ ల పెళ్లి కరోనా టైం లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్య చాలా సింపుల్గా జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే మిహికా బజాజ్ కి జైనబ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందట.
వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. అయితే ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే మిహికా బజాజ్ పెళ్లికి జైనబ్ వచ్చిందట.ఆ టైంలో అక్కినేని అఖిల్ కి జైనబ్ కి మధ్య తొలిసారి పరిచయం ఏర్పడిందట.అలా ఆ పరిచయం కాస్త చివరికి పెళ్లి వరకు దారితీసింది. అలా అఖిల్ జైనబ్ ల పెళ్ళికి పరోక్షంగా రానా భార్య మిహికా బజాజ్ కారణమైందని తెలుస్తోంది.(Akhil-Zainab)