Thandel: తండేల్ సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు ఆ హీరోనేనా.?
Thandel: ఏదైనా ఒక సినిమా విడుదలయితే ఆ సినిమా ఫలితం బాగుంటే ఈ సినిమాని ముందు మిస్ చేసుకున్న హీరోలు అబ్బా సినిమా చేసుంటే బాగుండు వేస్ట్ గా మిస్ చేసుకున్నాం అనుకుంటారు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం సినిమాని రిజెక్ట్ చేసి మంచి పని చేసాం అనుకుంటారు.ఇలా సినిమా రిజల్ట్ ని బట్టి ఆ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో హీరోయిన్ల రియాక్షన్ ఉంటుంది.అయితే తాజాగా ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న తండేల్ సినిమాని మిస్ చేసుకుని ఓ హీరో బాధపడుతున్నారట.

The Hero missed Thandel movie
మరి ఇంతకీ తండేల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరయ్యా అంటే న్యాచురల్ స్టార్ నాని అట.. తండేల్ మూవీకి డైరెక్షన్ చేసిన చందు మొండేటి అమొదట ఈ సినిమాకి పర్ఫెక్ట్ ఛాయిస్ హీరో నాని నుకున్నారట. ఎందుకంటే నాని చాలా నేచురల్ గా యాక్టింగ్ చేస్తారు కాబట్టి రియల్ గా జరిగిన కథలో ఆయన యాక్టింగ్ బాగుంటుందని నమ్మి నానిని తీసుకుందామని ఆయనకు కథ చెప్పారట.(Thandel)
Also Read: Tandel Movie: బుకింగ్స్ జోరందుకుంటున్న తండేల్.. చైతు ప్రతాపం!!
అయితే ఈ సినిమాలో డిగ్లామరస్ లుక్ లో కనిపించాలి కాబట్టి ఇప్పటికే నేను దసరా సినిమాలో డీ గ్లామరస్ లుక్ లో కనిపించాను.. మళ్లీ అదే లుక్ లో అంటే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది.ఈ సినిమా వేరే ఎవరితోనైనా చేయండి అని సలహా ఇచ్చారట. దాంతో ఈ సినిమా కథ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లి చివరికి నాగచైతన్య దగ్గరికి వచ్చి ఆగింది. ఇక నాగచైతన్య ఈ స్టోరీ వినడంతోనే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారట.

అంతేకాదు ఇప్పటివరకు ఇలాంటి స్టోరీ నేను వినలేదు అని వెంటనే సినిమాకి ఓకే చెప్పారు. అలా తెరకెక్కిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది.అయితే ప్రస్తుతం ఈ సినిమా హీరో నాని రిజెక్ట్ చేశారు అని వార్తలు రావడంతో చాలామంది ఆయన ఫ్యాన్స్ సినిమా చేసి ఉంటే బాగుండేది కదా అన్నా అని కామెంట్లు పెడుతున్నారు.(Thandel)