Sankranthiki Vasthunnam: “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాని రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరో.?

Sankranthiki Vasthunnam: ఏంటి సంక్రాంతి వస్తున్నాం సినిమాలో హీరోగా మొదట వెంకటేష్ ని అనుకోలేదా.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే ఈ స్టోరీ వెంకటేష్ చేతికి వచ్చిందా..ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచేసిన సినిమాని మొదట ఓ హీరో రిజెక్ట్ చేశారట.

The Hero Who Rejected The Movie Sankranthiki Vasthunnam

The Hero Who Rejected The Movie Sankranthiki Vasthunnam

ఆ హీరో కాదనడం వల్ల ఇది వెంకటేష్ కి వచ్చిందట. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తారు. ఈ సినిమాలో వెంకటేష్ కి భార్యగా ఐశ్వర్య రాజేష్ ప్రియురాలిగా మీనాక్షి చౌదరిలు నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గోదారి గట్టు మీద రామచిలకవే పాట ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. (Sankranthiki Vasthunnam)

Also Read: Pawan Kalyan: అల్లుడు అంటూనే బన్నీపై పగ బయటపెట్టిన పవన్ కళ్యాణ్.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది. అయితే భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్,డాకు మహారాజు వంటి సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమాని మొదట మిస్ చేసుకుంది చిరంజీవట. అవును మీరు వినేది నిజమే.మెగాస్టార్ చిరంజీవికే మొదట ఈ సినిమాలో అవకాశం వచ్చిందట. కానీ ఆయన వేరే సినిమాలో బిజీగా ఉండి ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేని కారణంగా ఈ సినిమా స్టోరీని రిజెక్ట్ చేశారట.

The Hero Who Rejected The Movie Sankranthiki Vasthunnam

ఈ సినిమా చిరంజీవి చేయనని చెప్పడంతో వెంకటేష్ దగ్గరికి వెళ్లిందట. అయితే ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.చిరంజీవిని మొదట అనుకున్నప్పటికీ ఆయన వేరే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల వెంకటేష్ ని తీసుకున్నాం అంటూ అనిల్ రావిపూడి చెప్పారు. ఇక ఈ విషయం తెలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ కావాలి అని వెంకీ అభిమానులు భావిస్తున్నారు.(Sankranthiki Vasthunnam)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *