Samantha: సమంతకు షాక్ ఇచ్చిన హీరో..లీగల్ నోటీసులు పంపి..?
Samantha: ఏంటి ఆ తెలుగు హీరో సమంత ఇంటికి లీగల్ నోటీసులు పంపించారా.. ఇంతకీ సమంత చేసిన తప్పేంటి.. ఆమె ఇంటికి లీగల్ నోటీసులు పంపించడం వెనుక కారణం ఏమై ఉంటుంది. సమంత ఒకప్పుడు అంటే నాగచైతన్యతో విడాకులు కాకముందు సౌత్ లో చాలా బిజీగా ఉండేది. తెలుగు,తమిళం అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో సినిమాల్లో నటించేది.కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో విడాకులు వచ్చి మయాసైటిస్ వ్యాధి వచ్చిందో అప్పటినుండి తెలుగు సినిమాలకు మెల్లిమెల్లిగా దూరం అవుతుంది.
The hero who shocked Samantha sent legal notices
ప్రస్తుతం అయితే సమంత చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాతో రాబోతుంది. కానీ ఏ తెలుగు హీరోతో కూడా ఈ హీరోయిన్ నటించడానికి సిద్ధంగా లేదు.అయితే మయాసైటిస్ రాకముందు ఓ తెలుగు హీరోకి సినిమా చేస్తానని అగ్రిమెంట్ చేసుకుందట సమంత. కానీ మాయాసైటీస్ రావడంతో ఆ హీరో కూడా తన సినిమాని పక్కన పెట్టి వేరే ప్రాజెక్టులు చేశారు.(Samantha)
Also Read: Samantha: ఇంట్లో టార్చర్.. భర్త అనే అహంకారం.. నాగచైతన్య నిజస్వరూపం బయటపెట్టిన సమంత.?
అయితే ఇప్పుడు సమంతకి మయాసైటిస్ తగ్గిపోవడంతో సమంత ఇంటికి వెళ్లి అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న సినిమాని ఇప్పుడు పూర్తి చేద్దామా అని ఆ హీరో అడగడంతో సారీ నాకు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో చేసేంత ఇంట్రెస్ట్ లేదు.నేను ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నాను అంటూ చెప్పేసిందట. దాంతో ఆ హీరోకి చాలా కోపం వచ్చి అలా అయితే ఎందుకు మీరు ముందుగా అగ్రిమెంట్ చేశారు.
ఈ విషయంపై నేను కోర్టుకు వెళ్తాను అంటూ చెప్పారట.కానీ సమంత మాత్రం మీరు ఏదైనా చేసుకోండి నాకైతే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిందట.దాంతో కోపంతో ఆ హీరో సమంత రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని లీగల్ గా నోటీసులు ఆమె ఇంటికి పంపించారట. దాంతో సమంత ఆ హీరో అన్నంత పని చేశాడని షాక్ లో మునిగి పోయినట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు..నిజంగానే సమంత ఇంటికి లీగల్ నోటీసులు పంపించారా అనేది తెలియాల్సి ఉంది.(Samantha)