Allu Arjun: అల్లు అర్జున్ పై పగబట్టిన హీరోలు.. ఇంటికి పిలిపించుకొని మరీ అవమానించారా.?
Allu Arjun: తెలుగు ఇండస్ట్రీలో మెగా అల్లు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. నిజానికి వీరిద్దరి ఇంటిపేర్లు వేరైనా కుటుంబాలు మాత్రం ఒకటే. ఈ రెండు ఫ్యామిలీల నుంచి ఎంతో మంది హీరోలు స్టార్లుగా ఎదిగారు. అలాంటి ఈ పెద్ద ఫ్యామిలీలో అనేక విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడప్పుడు ఈ విభేదాలు అనుకోకుండానే బయటపడి సోషల్ మీడియాలో వార్తలుగా నిలుస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ విషయంలో కూడా మరోసారి విభేదాలు బయటపడ్డటయింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..
The heroes who took revenge on Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవడం మధ్యంతర బెలుల్ పై బయటకు రావడం చక చకా జరిగిపోయాయి. కొందరు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ స్వయంగా తన కారు నడుపుకుంటూ తన పెద్ద మామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి కొంతసేపు సమయం గడిపారు. అక్కడి నుంచి నేరుగా నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై కూడా మాట్లాడారట. మెగా ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో వారి మధ్య విభేదాలు లేవని అందరూ భావించారు. (Allu Arjun)
Also Read: Nirmala Devi: మనోజ్ అబద్దాలకోరు.. విష్ణు ఆ తప్పు చేయలేదు.. మనోజ్ తల్లి షాకింగ్ లేఖ.?
కానీ అసలు విషయం ఇక్కడే దాగి ఉంది.. చిరంజీవి నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లినప్పుడు అక్కడే ఉన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఆయనతో మాట్లాడలేదట. కనీసం ఫోన్ చేసి కూడా ఆయనను అడగలేదని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు వరుణ్ తేజ్ మట్కా సినిమా వేడుకల్లో కూడా పరోక్షంగా అల్లు అర్జున్ పై కొన్ని కామెంట్స్ చేశారు.
ఈ ఇద్దరే కాకుండా వైష్ణవ్ తేజ్ కూడా అల్లు అర్జున్ కు కనీసం పరామర్శ చెప్పకపోవడం సర్వత్రా చర్చానియశమైంది. ఇండస్ట్రీ వారంతా అల్లు అర్జున్ ను పరామర్శిస్తే ఈ ముగ్గురు హీరోలు మాత్రం ఆయనపై పగబట్టినట్టు ఉన్నారని అందుకే జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ తో కనీసం మాట్లాడలేదని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. వీరు మాట్లాడకపోవడానికి అసలు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు.(Allu Arjun)