Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్.. ఆ హీరోతో ముద్దులు పెట్టుకుంటూ.?


Vaishnav Tej: ఏంటి ఆ హీరోయిన్ వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చి మరో హీరోతో ప్రేమలో పడిందా..మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు… నిజంగానే వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం..వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చింది అంటూ వార్తల్లో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ.. అయితే ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో హీరోయిన్ రీతూ వర్మ కనిపించిందో అప్పటినుండి వైష్ణవ్ తేజ్ రీతూ వర్మ మధ్య ప్రేమ ఉందనే రూమర్స్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

The heroine who gave hand to Vaishnav Tej

The heroine who gave hand to Vaishnav Tej

ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ రీతూ వర్మ లావణ్య త్రిపాఠి ఫ్రెండ్ అంతే మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అన్నాడు.కానీ అప్పటినుండి ఇప్పటి వరకు వార్తలు మాత్రం ఆగడం లేదు.అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ కి హ్యాండ్ ఇచ్చి మరో హీరో ప్రేమలో పడింది రీతూ వర్మ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం తాజాగా రీతూ వర్మ ఒక రీల్ చేస్తుంటే ఆ రీల్ మధ్యలో హీరో సందీప్ కిషన్ వచ్చి ఆమె బుగ్గ పై ముద్దు పెట్టాడు. (Vaishnav Tej)

Also Read: Heroine: వాలంటైన్స్ డే రోజు ఆ హీరోతో దుబాయ్ కి చెక్కేసిన టాలీవుడ్ హీరోయిన్..?

అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలా మంది నెటిజన్స్ వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారనే రూమర్లు క్రియేట్ చేశారు. అయితే ఇది రూమర్ అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం రీతూ వర్మ సందీప్ కిషన్ ఇద్దరు కలిసి మజాకా అనే మూవీలో చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలా రీల్ చేసిన సమయంలో సందీప్ కిషన్ ముద్దు పెట్టారు.

The heroine who gave hand to Vaishnav Tej

ఇలా ముద్దు పెడితే సినిమాకి మరింత హైప్ పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసినట్టు తెలుస్తోంది.కానీ మరి కొంత మందేమో లేదు లేదు సందీప్ కిషన్ తో రీతూ వర్మ నిజంగానే ప్రేమలో ఉంది. అందుకే అంత పబ్లిక్ గా ముద్దులు పెట్టుకుంటున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఉన్న అసలు నిజం ఏంటో తెలియాల్సి ఉంది.(Vaishnav Tej)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *