Mahesh Babu: చచ్చినా నీతో నటించను అంటూ మహేష్ బాబుని అవమానించిన హీరోయిన్.?
Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీకి కౌబాయ్ మూవీస్ పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ.. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించారు ఆయన రికార్డులను ఇప్పటికీ ఏ హీరో కూడా దిట్ చేయలేకపోతున్నారు. ఓకే ఏడాది పదికి పైగా చిత్రాల్లో నటించిన ఏకైక హీరో కృష్ణ మాత్రమే. అలాంటి కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

The heroine who insulted Mahesh Babu
లుక్ పరంగా, శరీర సౌష్టవం పరంగా ఎంతో అద్భుతంగా ఉండే మహేష్ బాబు పక్కన ఆ హీరోయిన్ చేయడానికి అస్సలు ఒప్పుకోలేదట. మరి ఆమె ఎవరు ఎందుకు ఒప్పుకోలేదు వివరాలు చూద్దాం.. మహేష్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అలాంటి మహేష్ బాబుతో సినిమా అంటే ఆ స్టార్ హీరోయిన్ ససేమీరా అందట..దీనికి కారణం కూడా ఎంటో ఆమె చెప్పింది.. (Mahesh Babu)
Also Read: Laila: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న లైలా..ఒక్క నిమిషం కూడా అలా చేయకుండా ఉండలేదట.?
మహేష్ బాబు రాజకుమారుడు చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో రెండవ చిత్రంగా యువరాజుతో మన ముందుకు వచ్చారు. వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో యువరాజు మూవీ తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలనుకున్నారు. ముందుగా సాక్షి శివానందును ఫైనల్ చేశారు. ఆ తర్వాత సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చింది..

సిమ్రాన్ కంటే ముందు ఈ చిత్రంలో సౌందర్యను హీరోయిన్ గా అనుకున్నారట. అంతేకాదు సౌందర్య మహేష్ బాబుకు మధ్య లుక్ టెస్ట్ కూడా చేశారట. కానీ ఆ సమయంలో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా సౌందర్య కు తమ్ముడిగా కనిపించడంతో ఆమె వద్దని చెప్పిందట.. అంతేకాదు సిమ్రాన్ ను తీసుకుంటే బాగుంటుందని సజెషన్ చేసిందట. ఆమె చెప్పినట్టుగానే ఈ చిత్రంలో సిమ్రాన్ ను హీరోయిన్ గా పెట్టారు. అలాంటి ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.(Mahesh Babu)