Ravi Teja: ఛీ ఛీ ఆయనకు నేను తల్లినేంటి అంటూ రవితేజ మూవీ రిజెక్ట్ చేసిన హీరోయిన్.?

Ravi Teja: కొంతమంది నటీనటులు సినిమాల్లో చేసే పాత్ర నచ్చకపోతే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఓ హీరోయిన్ కూడా రవితేజ సినిమాలో తల్లి పాత్రలో నటించమంటే నటించను అని రిజెక్ట్ చేసిందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే విజయశాంతి..అవును మీరు వినేది నిజమే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీ లో రవితేజ తల్లి పాత్రలో రాధిక నటించిన సంగతి మనకు తెలిసిందే.
The heroine who rejected Ravi Teja movie
అయితే ఈ పాత్ర కోసం మొదట విజయశాంతినే అనుకున్నారట అనిల్ రావిపూడి. అలా రవితేజ కి తల్లి పాత్రలో విజయ్ శాంతి నటిస్తే బాగుంటుంది అని విజయశాంతి దగ్గరికి వెళ్లి అనిల్ రావిపూడి సినిమాలో చేయమని అడిగారట.కానీ ఆమె నో చెప్పిందట.అలా ఎన్నిసార్లు అడిగినా కూడా విజయశాంతి రిజెక్ట్ చేయడంతో చివరికి రాధికని తీసుకున్నారట. (Ravi Teja)
Also Read: Vijayashanti: స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ పెట్టుకున్న విజయశాంతి.. భర్తకు తెలిసి.?
ఇక రాజా ది గ్రేట్ మూవీ మాత్రమే కాదు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా మొదట విజయశాంతిని నటించమని అడిగితే నో చెప్పిందట.అలా చాలా రోజులు డైరెక్టర్ ని తిప్పించుకొని చివరికి డైరెక్టర్ బాధ చూడలేక నటిస్తానని చెప్పిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో విజయశాంతి ఏప్రిల్ 18న మన ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కళ్యాణ్రామ్ కి తల్లి పాత్రలో విజయశాంతి చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సుమా అనిల్ రావిపూడి,విజయశాంతి,కళ్యాణ్ రామ్ లను ఇంటర్వ్యూ చేసింది.అలా ఆ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి విజయశాంతి గురించి ఈ విషయాన్ని తెలియజేశారు.(Ravi Teja)