Rambha: రంభ కాపురంలో నిప్పులు పోసిన హీరోయిన్.. పాపం అంత బాధపడిందా.?

Rambha: సాధారణంగా చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ రంభ. 90s లో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది రంభ. అలాంటి ఈమె ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకొని తన సొంత లైఫ్ ను అనుభవిస్తుంది.. అలాంటి రంభ జీవితం ఒక హీరోయిన్ వల్ల కాస్త ఇబ్బందుల పాలయిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు వివరాలు ఏంటో చూద్దాం..
The heroine who set Rambha Kapuram in fire
అయితే రంభ తన సోషల్ మీడియా ఖాతాను మొదటిసారి ఓపెన్ చేసిందట. ఆ టైంలో ముందుగా తన భర్తను ఫాలో కమ్మని అడిగిందట. కానీ ఆయన ఆమె మాటను పెడచెవిన పెట్టి తమన్నా భాటియాను ముందుగా ఫాలో అయ్యారట. దీంతో రంభ కోపానికి వచ్చి, ఇప్పటికీ తన భర్త సోషల్ మీడియాలో అకౌంట్ ను ఫాలో అవ్వట్లేదట. దీనికి ప్రధాన కారణం ఆమె తనను ముందుగా ఫాలో కమ్మని చెబితే, భార్యకు విలువ ఇవ్వకుండా వేరే హీరోయిన్ కు విలువిచ్చి ఆమెనే ఫాలో అయ్యాడని ఆమె కోపం పెంచుకుందట.(Rambha)
Also Read: Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ సూసైడ్.. సంచలన నిజం వెలుగులోకి..?
దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తమన్నా అంటే పడదా? ఆమెను ఫాలో అయితే ఈమెకి ఏంటి నొప్పి అంటూ కామెంట్లు పెడుతున్నారు.. దీనిపై స్పందించినటువంటి రంభ నేను తమన్నాని ఫాలో కావద్దని చెప్పలేదు, నా భర్త ముందుగా నాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని చెప్పాను. దానివల్లే నాకు కోపం వచ్చి ఆయన నేను ఫాలో కావట్లేదని చెప్పుకొచ్చింది.

దీనిపై మరికొంతమంది నెటిజన్సు స్పందించి మేమెవ్వరం కూడా మా భర్త అకౌంట్స్ ఫాలో అవ్వట్లేదు. నీకెందుకు అలా అనిపించిందో మాకు తెలియదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా తమన్నా వల్ల రంభ దంపతుల మధ్య కాస్త ఇబ్బందులు వచ్చాయని అర్థమవుతుంది. ఇవి 2010లో కెనడా వ్యాపారవేత్త అయినటువంటి ఇంద్ర కుమార్ పద్మనాథుని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లయింది.(Rambha)