Venkatesh: వెంకటేష్ ని టార్చర్ చేసిన హీరోయిన్.. పాపం అన్ని ఇబ్బందులు పడ్డాడా.?
Venkatesh: దగ్గుబాటి వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మళ్లీ వెంకటేష్ ని థియేటర్లో చూడబోతున్నాం. గత ఏడాది వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ దారుణంగా ప్లాఫ్ అయ్యి అభిమానులను నిరాశపరిచింది. కానీ ఈ ఏడాది మాత్రం వెంకటేష్ హిట్ కొట్టేలా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు చూస్తే మాత్రం వెంకీ ఖాతాలో బ్లాక్బస్టర్ పక్కా అని అంటున్నారు చాలామంది.
The heroine who tortured Venkatesh
దిల్ రాజు నిర్మాతగా చేసిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గానే నిజమాబాద్ లో గ్రాండ్గా జరిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ లో వెంకటేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఈ మూవీలో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్ తన ఫ్లాష్ ప్యాక్ లవ్ స్టోరీని తన భార్యకు చెప్పి ఎన్ని ఇబ్బందులు పడ్డారు.. (Venkatesh)
Also Read: Game Changer Movie: గేమ్ ఛేంజర్ సేఫ్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా.. పెద్ద టార్గెట్?
ప్రియురాలు భార్య మధ్య వెంకీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.ఇక సినిమా చూస్తే మరింత నవ్వుకోవడం ఖాయం అని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ విషయాన్ని బయట పెట్టారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.భార్య పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో వెంకటేష్ ని తెగ టార్చర్ చేసిందని చెప్పారు.
అంతేకాదు ప్రియురాలు పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి గ్లామర్ ఈ సినిమాకి మరింత ప్లస్ అవుతుంది అన్నారు.అలాగే మీ వెంకీ మామ మా వెంకీ మామ సినిమాకి ప్రాణం పెట్టేశాడు. ఈ సినిమాని ఇంటిల్లిపాది వెళ్లి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.సంక్రాంతికి మంచి సినిమాను అందించాం అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.(Venkatesh)