Sankrantiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బంగారం లాంటి భాగ్యం పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్స్.?
Sankranthiki Vasthunnam: ఒక్కోసారి ఇండస్ట్రీలో కొంతమందిని నటులను దృష్టిలో పెట్టుకొని కథలు ఎంపిక చేసుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. చివరికి ఆ కథలను వారి అనుకున్న నటినటుల దగ్గరికి వెళ్లి వినిపిస్తే వారికి సమయం లేకనో లేక కథ నచ్చకనో మిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ కాకుండా మరో హీరోయిన్ ను తీసుకుందామని అనుకున్నారట.
The heroines who missed the role of Sankranthiki Vasthunnam
కానీ ఏవో చిన్న కారణాలవల్ల ఆ హీరోయిన్ తప్పుకోవడంతో ఇది ఐశ్వర్య రాజేష్ ను వరించింది. మరి ఆ హీరోయిన్ ఎవరు వివరాలు ఏంటో చూద్దామా.. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి “సంక్రాంతి వస్తున్నాం” సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సినిమాలో వెంకటేష్ కు హీరోయిన్ గా కాజల్ ను తీసుకుందామని ఆమెను సంప్రదించారట.(Sankranthiki Vasthunnam)
Also Read: Sankrantiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించిన బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ ఇదే..?
కానీ కాజల్ కు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. వెంటనే ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందట. ఈ విధంగా సినిమాలో వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. ఆయనకు లవర్ గా మీనాక్షి చౌదరి అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ విధంగా వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి భారీ హీట్ సాధించింది.
ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో కాజల్ ఎందుకు మిస్ చేసుకున్నానని బాధపడుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వెంకటేష్ ల నటనకు ప్రేక్షకులంతా కడుపుబ్బ నవ్వారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా డాకు మహారాజ్, గేమ్ చేంజర్ చిత్రాలను దీటు చేసి మరీ దూసుకుపోతోంది.(Sankranthiki Vasthunnam)